RS Praveen Kumar: బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా.. బీఆర్ఎస్‌లో చేరిక

బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి మాయావతికి పంపించారు. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్‌లో చేరనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం.

New Update
RS Praveen Kumar: బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా.. బీఆర్ఎస్‌లో చేరిక

RS Praveen Kumar Resigned to BSP: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి మాయావతికి పంపించారు. ఇటీవల రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పొత్తు (BRS-BSP Alliance) పెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా బీఎస్పీ కి రెండు స్థానాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్, నాగర్ కర్నూల్ (Nagarkurnool) రెండు ఎంపీ స్థానాల్లో బీఎస్పీ పోటీ చేయనుంది. నాగర్ కర్నూల్ నుంచి బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. తాజాగా బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

బీజేపీ కుట్రలు..

తాను బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు ప్రవీణ్ కుమార్. ఆయన ట్విట్టర్ లో.. "పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే అని . కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. నిన్న బీయస్పీ- బీఆరెస్ పొత్తు వార్త భయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను." అంటూ రాసుకొచ్చారు.

బీఆర్ఎస్ లోకి..

తన రాజీనామా అనంతరం నంది నగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) తో భేటీ అయ్యారు ప్రవీణ్ కుమార్. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ప్రవీణ్ కుమార్ రాజీనామా తో బీఎస్పీ బీఆర్ఎస్ మధ్య ఉన్న పొత్తు కొనసాగుతుందా? లేదా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.

Also Read: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్

Advertisment
Advertisment
తాజా కథనాలు