అనంతపురంలో పోలీసులమని చెప్పి..2 కోట్లు ఎత్తుకెళ్లారు! అనంతపురం జిల్లా గార్ల దిన్నె లో సినిమా డ్రామాని తలపించే విధంగా ఓ దొంగతనం జరిగింది. పోలీసులమని చెప్పి కారులో ఉన్న సుమారు 2 కోట్ల రూపాయలను దుండగులు ఎత్తుకుపోయారు. By Bhavana 23 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి ఈ మధ్య చోరీలు చాలా విచిత్రంగా జరుగుతున్నాయి. కొంతమంది రాత్రి పూట దొంగతనాలు చేస్తుంటే కొందరు ప్రబుధ్దులు మాత్రం పట్టపగలే దోచేస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా గార్ల దిన్నె లో సినిమా డ్రామాని తలపించే విధంగా ఓ దొంగతనం జరిగింది. పోలీసులమని చెప్పి కారులో ఉన్న సుమారు 2 కోట్ల రూపాయలను దుండగులు ఎత్తుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గార్లదిన్నె వద్ద హైవే పై బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎస్‌ఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ కు చెందిన కొందరు ఉద్యోగులు కారులో డబ్బులు తీసుకుని వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ముందు దుండగులు పోలీసుల దుస్తులు ధరించి ముందుగా కారును ఆపారు. తనిఖీలు నిర్వహించాలని చెప్పి కారులో ఉన్న వారితో మాట్లాడారు. ఈ క్రమంలో కారులో సంస్థకు చెందిన సుమారు 2 కోట్ల రూపాయలను మేము స్వాధీనం చేసుకున్నామని బాధితులతో చెప్పి నగదును తీసుకుని వెళ్లిపోయారు. పోలీసు స్టేషన్లో డబ్బును స్వాధీనం చేసుకోవాలని వారికి చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే దుండగులు వెళ్లిపోయిన తరువాత కానీ బాధితులకు మోసపోయామని తెలియలేదు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఫిర్యాదు అందుకున్న పోలీసులు డబ్బులు తీసుకు వెళ్తున్న సంగతి తెలిసిన వారే ఇలాంటి పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సంఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. #anantapur #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి