Govt Jobs 2024: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 11,558 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

నిరుద్యోగులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలకు సంబంధించి 11,558 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 14నుంచి అక్టోబర్ 20 వరకు అప్లికేషన్ ప్రక్రియ కొనసాగనుంది. rrbapply.gov.in

New Update
Railway Jobs : ఉద్యోగార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రైల్వే రిక్రూట్‌మెంట్‌పై కీలక ప్రకటన!

Govt Jobs 2024: భారతీయ రైల్వేశాఖ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల(RRB NTPC 2024)కు సంబంధించి 11,558 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్-స్థాయి పోస్టుల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు కింద సూచించిన విధంగా ధరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

మెుత్తం ఖాళీలు: 11558
గ్రాడ్యుయేట్ (లెవెల్ 5, 6), అండర్ గ్రాడ్యుయేట్ (లెవెల్ 2,3) పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 14న మొదలై అక్టోబర్ 13న ముగుస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ 21 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 20వరకు కొనసాగనుంది.

గ్రాడ్యుయేట్ పోస్టులు:
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ అర్హత.

అండర్ గ్రాడ్యుయేట్:
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు ఉద్యోగాలు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు 12వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.

పరీక్ష విధానం:
ఆన్‌లైన్ పరీక్ష
స్టెప్ 1 -CBT 1
స్టెప్ 2 - CBT 2
టైపింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్) / ఆప్టిట్యూడ్ టెస్ట్
డాక్యుమెట్ వెరిఫికేషన్
వైద్య పరీక్ష.
ఇవన్నింటిలో అర్హత సాధించిన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌: rrbapply.gov.in

Advertisment
Advertisment
తాజా కథనాలు