AP: RTV ట్వీట్ కు స్పందించిన ఇండియన్ రైల్వే.. నిన్న విశాఖలో జరిగిన అగ్ని ప్రమాదంపై వివరణ!

RTV ట్వీట్‌కు విశాఖ రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ అధికారులు స్పందించారు. నిన్న జరిగిన కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ అగ్ని ప్రమాదంపై వివరణ ఇచ్చారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అలర్ట్ అయి మంటలను అదుపు చేశామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.

New Update
AP: RTV ట్వీట్ కు స్పందించిన ఇండియన్ రైల్వే.. నిన్న విశాఖలో జరిగిన అగ్ని ప్రమాదంపై వివరణ!

Railway Incidents: రైల్వే శాఖ పట్టాలు తప్పుతోంది. ప్రయాణికుల ప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది. వరుస రైలు ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒక్క జూలై నెలలోనే ఏకంగా ఐదు ప్రమాదాలు జరిగాయి. జులై 18న యూపీలోని గోండాలో రైలు పట్టాలు తప్పింది. జులై 19న గుజరాత్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పగా.. జులై 21న యూపీలోని అమ్రెహాలో మూడు బోగీలు బోల్తాపడ్డాయి. అంతేకాకుండా, జులై 29న బీహార్ సంపర్క్‌ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ క్రమంలోనే జులై 30న జార్ఖండ్ లోని బారాబంబో వద్ద రైలు పట్టాలు తప్పింది. ఇలా వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను కలవరానికి గురిచేస్తున్నాయి.

Also Read: భూమి వైపు దూసుకొస్తున్న 99 అడుగుల గ్రహశకలం!

తాజాగా, నిన్న  విశాఖ రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న కోర్బా - విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. విశాఖ రైల్వే స్టేషన్‌లోని 4వ నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఈ అగ్నిప్రమాదం జరిగింది. B7 బోగీలో మొదలైన మంటలు క్షణాల్లోనే B6, B8, M1 బోగీలకు వ్యాపించాయి. మొత్తం నాలుగు ఏసీ బోగీలు పూర్తిగా దగ్దమయ్యాయి. ఘటన జరిగిన సమయంలో రైలులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. స్టేషన్‌లో నిలిచి ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. అదే మార్గ మధ్యలో అయితే ప్రమాద తీవ్రత ఊహించని స్థాయిలో ఉండేదని RTV పేర్కొంది.

Also Read: యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు బిగ్ షాక్.. త్వరలోనే ఆ కొత్త చట్టం?

అయితే,  RTV ట్వీట్‌కు విశాఖ రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ అధికారులు స్పందించారు. నిన్న జరిగిన కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ అగ్ని ప్రమాదంపై వివరణ ఇచ్చారు. సుమారు 6. 24 గంటలకు రైలు నెం 18517, కోర్బా - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్.. విశాఖపట్నం స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌ నంబర్ 4కి చేరుకుందని.. తగిన తనిఖీ తర్వాత, షెడ్యూల్ నిర్వహణ పని కోసం కొత్త కోచింగ్ కాంప్లెక్స్‌లో తదుపరి ప్లేస్‌మెంట్ కోసం ర్యాక్ లోపల నుండి లాక్ చేయబడిందన్నారు. అయితే, ఇంతలోనే సుమారు 09:45 గంటలకు B7 బోగీలో మంటలు చెలరేగాయన్నారు. 

వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది, RPF సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించారన్నారు. సిబ్బందిలో ఒకరు ప్లాట్ ఫాం 3 వద్ద ఉంచిన సుత్తిని తీసుకుని అత్యవసర కిటికీలను పగలగొట్టి కోచ్‌లలో నీరు త్రాగుటకు అందుబాటులో ఉన్న హైడ్రెంట్ల ద్వారా మంటలను అదుపుచేయడానికి ప్రయత్నించారని తెలిపారు. అయితే, మంటలు క్షణాల్లోనే B6, B8, M1 బోగీలకు వ్యాపించాయన్నారు. బీ7 బోగీలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇంకా ప్రమాదానికి గల కారణాలపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు