MLC Kavitha : కవిత సీబీఐ చార్జిషీట్‌పై నేడు విచారణ

TG: లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ఛార్జిషీట్‌పై నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను ఏ17గా చేర్చుతూ ఛార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది. కాగా కవితను విచారణకు వర్చువల్‌గా హరాజరుపర్చనున్నారు అధికారులు.

New Update
MLC Kavitha: ఢిల్లీ ఎయిమ్స్‌కు కవిత.. కోర్టు కీలక ఆదేశాలు

Kavitha CBI Charge Sheet : లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) లో సీబీఐ ఛార్జిషీట్‌పై నేడు రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) లో విచారణ జరగనుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ను ఏ17గా చేర్చుతూ ఛార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది. కాగా కవితను విచారణకు వర్చువల్‌గా హరాజరుపర్చనున్నారు అధికారులు. ఇదిలా ఉంటే సీబీఐ కేసులో తనకు బెయిల్ కావాలంటూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత.. ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. కవిత తన బెయిల్ పిటిషన్ ను వెనక్కి తీసుకోవడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

Also Read : మూడు నెలలుగా జీతం అందుకోని పినాకి చంద్రఘోష్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Chess: ఫిడే మహిళల గ్రాండ్‌ప్రి చెస్‌ టోర్నీ విజేతగా కోనేరు హంపి

ఫిడే వుమెన్ గ్రాండ్ ప్రి చెస్ టోర్నీలో తెలుగు అమ్మాయి కోనేరు హంపి విజేతగా నిలిచింది. పునేలో జరిగిన ఈ చెస్‌ టోర్నీలో చివరి ఆట సమయానికి జు జినర్‌ తో కలిసి ఆమె అగ్రస్థానంలో కొనసాగించినప్పటికీ టై బ్రేక్ లో హంపిని విజేతగా ప్రకటించారు.

New Update
Humpy

humpy

మహారాష్ట్రలోని పూనేలో ఫిడే మహిళల గ్రాండ్ ప్రి చెస్ టోర్నీ ఆసక్తిగా సాగింది. ఇందులో తెలుగు అమ్మాయి. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి విజేతగా నిలిచింది. అయితే చైనాకు చెందిన జు జినర్ తో కోనేరు హంపి ఈ విజయాన్ని పంచుకుంది.  

టై బ్రేక్ లో విజేతగా..

ఫిడే మహిళల గ్రాండ్‌ ప్రి చెస్‌ టోర్నీలో రెండు ఫైనల్ మ్యాచ్ లు అయ్యాయి. ఒకటి కోనేరు హంపి, బల్గేరియాకు చెందిన నుర్గుయిల్ సలిమోవా ల మధ్యన జరిగితే...మరొకటి చైనా ప్లేయర్ జు చినర్, రష్యా ప్లేయర్ పులినా షువలోవాల మధ్య జరిగింది. ఈ ఫైనల్ పోరులో సలిమోవా పై కోనేరు హంపి 1-0 తేడాతో విజయం సాధించింది. మరోవైపు, జు జినర్‌ సైతం రష్యాకు చెందిన పొలినా షువలోవాపై గెలుపొందింది. దీంతో ఇద్దరూ మొదటి స్థానంతో ముగించినట్లయింది. కానీ మళ్ళీ ఫైనల్ గా  టై బ్రేక్ ఆధారంగా హంపిని టర్నీ విజేతగా ప్రకటించారు. మరో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక.. ముంగంతూల్ బత్ఖుయాగ్ (మంగోలియా)తో; వైశాలి.. సలోమ్‌ మెలియా (జార్జియా)తో; దివ్య దేశ్‌ముఖ్‌.. ఎలీనా కష్లిన్‌స్కాయా (రష్యా)తో తమ గేమ్‌లను డ్రాగా ముగించారు.   

 today-latest-news-in-telugu | chess | woman | koneru Humpy

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు