MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బెయిల్? .. టెన్షన్‌లో బీఆర్ఎస్ శ్రేణులు TG: లిక్కర్ స్కాం కేసులో తనకు బెయిల్ కావాలంటూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. కవితకు బెయిల్ ఇవ్వొద్దు అంటూ ఈడీ వాదనలు వినిపించింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. By V.J Reddy 23 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో తనకు బెయిల్ కావాలంటూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. కవితకు బెయిల్ ఇవ్వొద్దు అంటూ ఈడీ వాదనలు వినిపించింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. కాగా కవిత బెయిల్ పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. కోర్టులో ఈడీ వాదనలు ఇలా.. * కవిత పాత్రపై, లిక్కర్ స్కాం కుట్ర పై మా వద్ద కావాల్సిన ఆధారాలు ఉన్నాయి * సుప్రీం కోర్టులో కవిత తరపున ఉన్న పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్నారు * కవిత ను అరెస్ట్ చెయ్యమని ఈడి ఎటువంటి అండర్ టేకింగ్ ఇవ్వలేదు * కవిత సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ లో తన ఇంటికి వచ్చి విచారణ చేయాలని కోరారు * సుప్రీం కోర్టు కవితకు అనుకూలంగా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు * కవతను చట్టానికి లోబడి అరెస్ట్ చేశాం.. రూల్స్ ఫాలో అయ్యాం * బుచ్చిబాబు, మాగుంట రాఘవ, శరత్ ల వాంగ్మూలం తర్వాతే కవితను అరెస్ట్ చేశాం * నూతన మద్యం పాలసిలో మద్యం వ్యాపారులకు లాభం కలిగేలా నిబంధనలు చేర్చారు * అరుణ్ పిళ్ళై కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాం లో (ప్రాక్సీ) బినామీగా వ్యవహరించారు * సూర్యాస్తమయం లోపే కవితను అరెస్ట్ చేసి.. 24 గంటల్లో కోర్టులో హాజరు పరిచాం * కవిత అరెస్ట్ సందర్భంగా ట్రాన్సిట్ వారెంట్ అవసరం లేదు * ఈడి కి దేశంలో ఎటువంటి పరిమితులు ఉండవు * PMLA కు ప్రత్యేక చట్టం ఉంది, ఈడి అల్ ఇండియా ఇన్వెస్టిగేషన్ అథారిటీ * అరుణ్ పిళ్లై లిక్కర్ స్కాం లో కవితకు బినామీ * ఇండోస్పిరిట్ లో కవిత 32.5 శాతం వాటాదారులుగా ఉన్నారు * కవితకు రెప్రజెంటేటివ్ గా పిళ్లై వ్యవహరించారు * లిక్కర్ కేసులో కవిత పాత్ర పై అరుణ్ పిళ్లై స్టేట్‌మెంట్ ఇచ్చాడు * దినేష్ అరోరా వంద కోట్ల వ్యవహారం పై విచారణ సందర్భంగా పలు విషయాలు చెప్పాడు * బుచ్చిబాబు ఫోన్ లోని నోట్స్ లో లిక్కర్ స్కాం వ్యవహారంపై మరింత సమాచారం దొరికింది * నగదు లావాదేవీలు, కుట్ర ఈ రెండు అంశాలు లిక్కర్ కేసుకు వర్తిస్తాయి #kavitha-bail మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి