Rotting Potato Gas: నలుగురు కుటుంబ సభ్యులను చంపేసిన ఆలుగడ్డలు.. ఆలుగడ్డలు ఓ కుటుంబంలో నలుగురి ప్రాణాలు తీశాయి. 8 ఏళ్ల చిన్నారిని అనాథగా చేశాయి. సెల్లార్‌లో నిల్వ ఉంచిన ఆలుగడ్డలు కుళ్లిపోయి.. వాటి నుంచి వెలువడిన గాలిని పీల్చుకోవడం ద్వారా వీరంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రష్యాలో చోటు చేసుకుంది. By Shiva.K 29 Nov 2023 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Rotting Potato Gas Killed 4 Member: ఆలుగడ్డలేంటి.. నలుగురు కుటుంబ సభ్యులను చంపడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవును.. తినడానికి ఎంతో రుచికరమైన ఆలుగడ్డలు.. దాని నుంచి విడుదలైన వాసనతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆ కుటుంబంలో ఎనిమిదేళ్ల బాలిక మాత్రమే ప్రాణాలతో బయటపడింది. ఈ విషాధ ఘటన రష్యాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రష్యాలో భాగమైన రిపబ్లిక్ టాటర్‌స్థాన్‌లోని కజాన్ సమీపంలో లైషెవోలో ఓ కుటుంబం నివసిస్తోంది. మిఖాయిల్ చెలిషెన్(42), అనస్తాసియా(38), జార్జి(18), అనస్తాసియా తల్లి ఇరైడా ఆలుగడ్డల నుంచి వెలువడిన గాలి పీల్చుకుని ప్రాణాలు కోల్పోయారు. శీతాకాలంలో అవసరాల నిమిత్తం తమ ఇంటి సెల్లార్‌లో బంగాళ దుంపలను భారీగా నిల్వ ఉంచారు. అయితే, కూర వండటానికి కొన్ని బంగాళదుంపలను తీసుకోవడానికి మిఖాయిల్ తమ ఇంట్లోని సెల్లార్‌లో ప్రవేశించాడు. అయితే, ఆలుగడ్డలు కుల్లిపోయి వాటిని ఒకరకమైన విష వాయులు వెలువడింది. ఆ సెల్లార్ మొత్తం విష వాయువుతో నిండిపోయింది. దాంతో మిఖాయిల్ ఆ గాలి పీల్చుకుని స్పృహతప్పి పడిపోయాడు. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఆలు గడ్డల కోసం వెళ్లిన మిఖాయిల్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో.. అనస్తాసియా కూడా సెల్లార్‌లోకి వెళ్లింది. ఆమె కూడా ఆ గాలి పీల్చుకుని స్పృహతప్పి పడిపోయింది. తల్లిదండ్రులు ఎంతకీ రాకపోవడంతో 18 ఏళ్ల కొడుకు జార్జి సెల్లార్‌లోకి వెళ్లింది. అతను కూడా తిరిగి రాలేదు. వీరిలో కోసం అనస్తాసియా తల్లి ఇరైడా వెళ్లగా.. అమె కూడా ఆ విష వాయువుకు బలైపోయింది. అయితే, అప్పటికే ఏదో జరుగుతుందని గ్రహించిన ఇరైడా.. ఇరుగు పొరుగు వారికి సమాచారం అందించి.. తమ కుటుంబ సభ్యుల కోసం తాను కూడా సెల్లార్‌లోకి వెళ్లింది. దాంతో ఆ విష వాయువు పీల్చుకుని వృద్ధురాలు కూడా మృత్యువాత పడింది. ఇలా నలుగురు ఒకరి కోసం ఒకరు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ఆ ఇంట్లో చెలిషెవా(8) మాత్రమే ప్రాణాలతో బయటపడి.. అనాథగా మిగిలిపోయింది. బాధితుల ఇంటి పక్కన వారు పోలీసులకు విషయం చెప్పగా.. వారు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఆలు గడ్డల నుంచి వెలువడిన విష వాయువు కారణంగానే.. వారంతా ప్రాణాలు కోల్పోయారని నిర్ధారించారు. కాగా, ఈ ఘటనలో కుటుంబాన్నంతా కోల్పోయి అనాథగా మిగిలిన చెలిషెనా బోరున విలపిస్తోంది. చిన్నారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. Also Read: తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ! #international-news #international-telugu-news #rotting-potato-gas-killed-4-member #rotting-potato-gas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి