Rajanna Sirisilla: వేములవాడలో దొంగ బీభత్సం

వేములవాడలోని భగవంతురావునగర్‌లో ఓ దొంగ హల్‌చల్‌ చేశాడు. మహిళపై దాడి చేసి ఒంటి మీద ఉన్న నగలు దోచుకోవడంతో తీవ్రంగా ప్రతిఘటించిన మహిళ ఉదంతం సంచలనంగా మారింది. కాలనీలో భద్రత పెంచాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

New Update
Rajanna Sirisilla: వేములవాడలో దొంగ బీభత్సం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దొంగ బీభత్సం సృష్టించాడు. వేములవాడలో ఓ ఇంటికి వెళ్లిన దుండగుడు ముందుగా ఇంటి డోర్ కొట్టాడు. దీంతో మహిళ బయటకు రాగా ఆమె మెడలోంచి బంగారు చైన్ లాక్కెళ్లాడు దొంగ. పొద్దుపొద్దున్నే ఇంటి బయట ఏదో అలికిడి అనిపిస్తోందని లేచి చూసిన ఓ మహిళకు పీడ కలలాంటి ఘటన ఎదుర్కొంది. మహిళపై దాడి చేసి తన ఒంటి మీద ఉన్న నగలు దోచుకున్నాడు దొంగ. తీవ్రంగా ప్రతిఘటించిన మహిళ ఉదంతం సంచలనంగా మారింది. భగవంతురావునగర్‌లో నివసిస్తున్న పిల్లి శ్రీలతని ఉదయమే ఓ రాడ్ తీసుకొని ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. గట్టిగా కేకలు వేసి ఆమె ప్రతిఘటించింది. అయినప్పటికీ ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు లాక్కుని పరారైన ఘటన కలకలం రేపింది.

సీసీ కెమెరా దృశ్యాలు

కాగా.. ఈ మొత్తం సన్నివేశానికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆదివారం తెల్లవారుజామున ఓ దుండగుడు..ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడు. అప్పుడే శ్రీలతపై దాడి చేయగా.. పెంపుడు కుక్క అరవడం మొదలు పెట్టింది. దీంతో.. కుక్కను పట్టుకుని డోర్ తీసి బయటకు వచ్చి అటూ ఇటు చూస్తుండగా... అక్కడే నక్కిన దుండగున్ని చూసింది. వెంటనే ఎవరు నువ్వు అంటూ గట్టిగా అరవటం ప్రారంభించింది. ఈ క్రమంలో సుమారు 3 తులాల బంగారం గొలుసును అపహరించుకుని వెళ్లాడని బాధితురాలు వాపోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

భద్రత పెంచాలని విజ్ఞప్తి

అయితే ఆమె అరవటం ప్రారంభించటంతో.. ఆ దుండగుడు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. ఆ దుండగుడి నుంచి కాపాడుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించినా.. ఆమెను ఆ దుండగుడు వదల్లేదు. బంగారు గొలుసును పట్టువదలకుండా లాక్కుని.. ఆమెను తోసేసి, గోడ దూకి పారిపోయాడు. తీవ్ర భయాభ్రాంతులకు గురైన శ్రీలత వెంటనే.. ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకుంది. వెంటనే ఇంట్లో వాళ్లకు ఈ విషయం వివరించటంతో.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిద్రలేవగానే.. ఇలాంటి వార్త వినడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. తమ కాలనీలో భద్రత పెంచాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు