Rishi Sunak: మరో వివాదంలో యూకే ప్రధాని రిషి సునాక్‌

యూకే ప్రధాని రిషి సునాక్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. బ్రెగ్జిట్‌ తర్వాత ప్రతిపాదిత భారత్‌-బ్రిటన్‌ వాణిజ్య ఒప్పందం నుంచి సునాక్‌ కుటుంబం లబ్ధి పొందనుందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం ఈ ఒప్పందంపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి.

New Update
Rishi Sunak: మరో వివాదంలో యూకే ప్రధాని రిషి సునాక్‌

వివాదంలో భారత్‌-బ్రిటన్‌ వాణిజ్య ఒప్పందం..

యూకే ప్రధాని రిషి సునాక్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. బ్రెగ్జిట్‌ తర్వాత ప్రతిపాదిత భారత్‌-బ్రిటన్‌ వాణిజ్య ఒప్పందం నుంచి సునాక్‌ కుటుంబం లబ్ధి పొందనుందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం ఈ ఒప్పందంపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఈక్రమంలో రిషి సునాక్‌ భార్య అక్షితా మూర్తి(ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణమూర్తి- సుధామూర్తి దంపతుల కుమార్తె) అక్షతా మూర్తికి ఇన్ఫోసిస్‌లో 500 మిలియన్‌ డాలర్ల(రూ.5వేల కోట్లు) విలువైన షేర్లు ఉన్నాయి. దీనిపై బ్రిటన్‌ పార్లమెంటేరియన్లు, వాణిజ్య నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫోసిస్‌కు యూకేలోని ప్రభుత్వ, ప్రైవేటు కాంట్రాక్టులు ఉన్నాయి. దీంతో యూకేతో జరిగే వాణిజ్య ఒప్పందంలో ఆ కంపెనీకి లబ్ధి చేకూరుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వాణిజ్య చర్చల నుంచి వైదొలగాలని డిమాండ్..

తాజాగా బ్రిటన్‌లోని లేబర్‌ పార్టీకి చెందిన నేతలు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రధాని సునాక్‌ సతీమణి అక్షితాకు ఇన్ఫీలో షేర్లు, ఆమెకు లభించే ప్రయోజనాలపై మరింత పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. వాణిజ్య ఒప్పందంతో ఇన్ఫోసిస్‌కు ఎలాంటి లబ్ధి లభిస్తుందనే అంశాలపై మరింత స్పష్టత ఇవ్వాలంటున్నారు. వాణిజ్య చర్చల నుంచి సునాక్‌ వైదొలగాలంటున్నారు. ప్రధాని రిషి సునాక్‌పై ఆరోపణల నేపథ్యంలో ఆయనకు భారత వాణిజ్య ఒప్పందం నుంచి లభించే ప్రయోజనాలు ఏమైనా ఉంటే బహిరంగంగా వెల్లడించాలని బిజినెస్‌ అండ్‌ ట్రేడ్‌ సెలక్ట్‌ కమిటీ ఛైర్మన్‌, లేబర్‌ పార్టీ నేత డారెన్‌ జోన్స్‌ వెల్లడించారు.

తాజా ప్రతిపాదిత ఒప్పందంలో ఐటీ, కృత్రిమ మేధ రంగాల్లోని నిపుణులకు సులువుగా వీసాలు ఇవ్వాలని భారత్‌ పట్టుబడుతోంది. మరోవైపు భారత్‌కు ఎగుమతి చేసే స్కాచ్‌ విస్కీ, కార్లపై పన్నులు తగ్గించాలని బ్రిటన్‌ డిమాండ్‌ చేస్తోంది. అక్షితా మూర్తికి ఛైల్డ్‌ కేర్‌ సంస్థలో ఉన్న వాటాలను సరిగ్గా వెల్లడించలేదని యూకే పార్లమెంట్ స్టాండర్ట్స్‌ వాచ్‌డాగ్ ఇటీవల వెల్లడించింది. ఈపరిణామాలతో రిషి సునాక్‌పై మళ్లీ ఆరోపణలు చెలరేగాయి. ప్రధాని పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.

మొదటి బ్రిటిష్-ఆసియన్ యూకే ప్రధానిగా రికార్డు..

గతేడాది యూకే ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో జూలైలో జరిగిన బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో లిజ్ ట్రస్ గెలిచి.. సెప్టెంబర్లో బాధ్యతలు చేపట్టారు. కానీ ఆమె కేవలం 45 రోజులకే ప్రధాని పదవి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఆమె చేసిన సూచనలు బెడిసి కొట్టడంతో రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిషి సునక్ గెలిచారు. దీంతో మొదటి బ్రిటిష్-ఆసియన్ యూకే ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు