రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు ఆర్జీవీ సెల్ఫీ..!

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి ఆసక్తికర ట్వీట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద సెల్ఫీ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆర్జీవీ. నేను బయట, అతను లోపల అని చంద్రబాబును ఉద్దేశించి సెటైర్ వేశారు.

New Update
రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు ఆర్జీవీ సెల్ఫీ..!

Ram Gopal Varma tweet viral:  డైరెక్టర్ రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) మరోసారి ఆసక్తికర ట్వీట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు(rajahmundry central jail) వద్ద సెల్ఫీ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆర్జీవీ. నేను బయట, అతను లోపల అని చంద్రబాబు(Chandrababu)ను ఉద్దేశించి సెటైర్ వేశారు. ఈ ఫోటో పెట్టిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


వివాదాస్పదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ డైరెక్టర్ ఆర్జీవీ(RGV) . ఒకప్పుడు టాలీవుడ్(Tollywood)లో సూపర్ హిట్ సినిమాలు అందించిన ఆర్జీవీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం నా ఇష్టం అంటూ ఏవేవో సినిమాలు చేస్తున్నాడు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు.  ఇటీవల జగన్ కి సంబంధించిన కథతో వ్యూహం అనే సినిమాను తీస్తున్నారు. ఈ మూవీని రెండు పార్టులుగా తీసి ఎలక్షన్స్ టైంకి రిలీజ్ చేస్తానని ప్రకటించారు ఆర్జీవీ. ఈ సినిమాకు జగన్ పార్టీకి చెందిన వ్యక్తులే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేపథ్యంలో తీసిన ఈ సినిమా మొదటి భాగం నవంబర్ 10న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Also Read: వాలంటీర్‌తో ప్రేమలీల.. భర్తను చంపేందుకు స్కెచ్..చివరికి ఏం జరిగిందంటే..?

publive-image

ప్రస్తుతం, ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ మరో వివాదంకు దారి తీస్తోంది.  ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు నిలబడి ఓ సెల్ఫీ ఫోటో దిగి పోస్ట్ చేశాడు. నేను బయట, అతను లోపల అని చంద్రబాబును ఉద్దేశించి సెటైర్ వేశారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ఈ పోస్ట్ పై వ్యూవర్స్ రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. అతన్ని జైల్లో కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అని కొందరు కామెంట్స్ చేస్తుండుగా.. మరి కొందరు నెక్స్ట్ నువ్వే జాగ్రత్త అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు