kottagudem: ఇల్లందు మున్సిపాలిటీలో చల్లారని అవిశ్వాస సెగ.. కౌన్సిలర్ ఆస్తులపై దాడులు

ఇల్లందు మున్సిపాలిటీలో అవిశ్వాస సెగ ఇంకా చల్లారలేదు. అవిశ్వాస పరీక్షలో బీఆర్ఎస్‌ వీగిపోయిన కొద్దిసేపట్లోనే అసమ్మతి కౌన్సిలర్ ఆస్తులపై రెవన్యూ అధికారుల దాడులు నిర్వహించారు. కొండపల్లి సరితకు చెందిన మామిడితోట, కోళ్ల ఫారంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో తీవ్ర వాగ్వాదం మొదలైంది.

New Update
kottagudem: ఇల్లందు మున్సిపాలిటీలో చల్లారని అవిశ్వాస సెగ.. కౌన్సిలర్ ఆస్తులపై దాడులు

Bhadradri kottagudem: భద్రాధ్రికొత్తగూడెం జిల్లా ఇల్లందులో అవిశ్వాస మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయం మరింత వేడెక్కుతోంది. అవిశ్వాస పరీక్షలో బీఆర్ఎస్‌కు వీగిపోయిన కొద్దిసేపట్లోనే అసమ్మతి కౌన్సిలర్ ఆస్తులపై అధికారుల దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ కొండపల్లి సరిత కుటుంబానికి చెందిన మామిడితోట సహా కోళ్ల ఫారంను ధ్వంసం చేసేందుకు ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు ప్రయత్నించారు.

కక్ష్యసాధింపు చర్యలు..
ఈ క్రమంలో అడ్డుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ ఆందోళన చేపట్టారు. అయితే అటవీశాఖ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయంటూ చెబుతున్న అధికారులు.. ఈ రోజు తెల్లవారుజామున పోలీసుల సహకారంతో మామిడితోటను, నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కౌన్సిలర్ కుటుంబ సభ్యులు భూమిపై తమకు అన్ని హక్కులు ఉన్నాయంటూ ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నేత మున్సిపల్ చైర్మన్ కు వ్యతిరేకంగా నిర్వహించిన అవిశ్వాస పరీక్షలో పాల్గొన్నందుకు తమను ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెవిన్యూ అధికారులు వెనుదిరిగారు.

హరిప్రియ ఆందోళన..
ఇక ఘటనాస్థలికి చేరుకుని అధికారులను ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే హరిప్రియ.. ఇదేనా ప్రజా పాలన అంటూ అధికారులను నిలదీశారు. వెంటనే దాడులు ఆపకపోతే పోరాటానికైన సిద్ధమని హెచ్చరించారు. అంతేకాదు మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి ఆందోళనకు దిగనున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి : Telangana : కేసీఆర్‌ అవినీతిని గ్రామగ్రామాన చాటిచెప్పండి.. కాంగ్రెస్‌ శ్రేణులకు సీఎం పిలుపు

ఇదిలావుంటే.. కొద్ది రోజుల క్రితం మునిసిపల్ చైర్మన్ దమ్మాలపాటిపై అవిశ్వాసం కోరుతూ కొందరు కౌన్సిలర్లు వినతిపత్రం సమర్పించారు. దీంతో జిల్లా కలెక్టర్ అవిశ్వాస తీర్మానానికి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇల్లందు పురపాలకంలో చైర్మన్ సహా 24 మంది కౌన్సిలర్లు ఉండగా వీరిలో కోరం ప్రకారం 17 మంది సభ్యులు హాజరు కావాలి. కానీ ఒక్కరు తగ్గినా అవిశ్వాసం వీగుతుంది. అవిశ్వాస తీర్మాన సమావేశానికి 15 మంది మాత్రమే బీఆర్ఎస్ సభ్యులు ఉండటంతో అవిశ్వాసం వీగిపోయింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు