Ponnam Prabhakar : అభయహస్తం పథకాలకు దరఖాస్తు చేసుకోని వారికి రేవంత్ సర్కార్ షాక్.. మంత్రి కీలక ప్రకటన! అభయహస్తం దరఖాస్తులకు పొడిగింపు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తులకు గడువు పెంచుతారనే ప్రచారం జరుగుతుండటంతో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజాపాలనకు జనవరి 6వ తేదీనే డెడ్ లైన్ అని చెప్పారు. By Bhoomi 03 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Abhaya Hastam : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన(PRAJAPALANA) కొనసాగుతోంది. అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ తేదీలో ఎలాంటి పొడగింపు ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 6వ తేదీలోపు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వమే దరఖాస్తు ఫామ్ ఇస్తుంది కాబట్టి.. కుటుంబానికి ఒక దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారెంటీల పథకాల(Six Guarantee Schemes)కు సంబంధించి ఒకే దరఖాస్తును చేసుకోవాలని.. ముందుగా నిర్ణయించినట్లు జనవరి 6వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తు తేదీ ఉంటుందని మంత్రి పొన్నం వివరించారు. ఈ తేదీ తర్వాత ఎలాంటి పొడిగింపు ఉండదని పేర్కొన్నారు. అభయహస్తం(Abhaya Hastam Scheme) కింద దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని.. గడువు ముగిసిన తర్వాత స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి భిన్నంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇఫ్పుడు..6వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని..గడువు పొడిగింపు లేదని ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. డిసెంబర్ 28వ తేదీ నుంచి ప్రజాపాలనపేరుతో కాంగ్రెస్ 5 గ్యారెంటీలకు దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఇప్పటికే లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. ఎక్కువగా పెన్షన్, ఇళ్లకు సంబంధించి దరఖాస్తులు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: పుట్టిన నెలను బట్టి ఈ పువ్వును బహుమతిగా ఇస్తే…మీ బంధం ఫెవికాల్ కంటే బలంగా ఉంటుంది..!! #cm-revanth-reddy #ponnam-prabhakar #abhayahastam-scheme మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి