Kishan Reddy: రేవంత్ రెడ్డికి ఆ శక్తి లేదు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు TG: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి రేవంత్ రెడ్డికి లేదని అన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉంటాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని అన్నారు. By V.J Reddy 18 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Kishan Reddy: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో మేథావులు, విద్యావంతులు బీజేపీకి అండగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పాలనను చూసి ప్రజలు అస్యహించుకుంటున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకై ప్రజల పక్షాన పోరాడుతాం అని తెలిపారు. ఎన్నికల్లో గెలిచేందుకు తప్పుడు హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చెప్పిన హామీలు అమల్లోకి తేవడం సాధ్యం కాదని అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి పెద్ద ఎత్తున ఆధరణ పెరుగుతుందని... దేశంలో మోదీ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. #kishan-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి