AP Volunteers: వారి ఒత్తిడితోనే రాజీనామా.. విధుల్లో చేర్చోకోవాలని వాలంటీర్ల వేడుకోలు! ఎన్నికల ముందు రాజీనామా చేసి వైసీపీ విజయం కోసం పని చేసిన వాలంటీర్ల పరిస్థితి ఏంటన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఇలా రాజీనామా చేసిన అనేక మంది వాలంటీర్లు తమను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. By Nikhil 16 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి ఎన్నికలకు కొన్ని రోజుల ముందు రాజీనామా చేసి వైసీపీ కోసం ప్రచారం చేసిన వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని వారు తలలు పట్టుకుంటున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని వారిలో చాలా మంది టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పలువురు వాలంటీర్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబును కలిశారు. ఎన్నికల ముందు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని ఎమ్మెల్యేకు తెలిపారు. తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. వైసీపీ నేతల ఒత్తిడి మేరకే రాజీనామా చేశామని వారు చెప్పారు. ఇక నెల్లూరులో వాలంటీర్లు ఏకంగా వైసీపీ నేతలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ గౌరి, సురేష్‌రెడ్డి ఒత్తిడితోనే తాము రాజీనామా చేశామని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. ఇలా రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తిగా మారింది. ఎన్నికల ముందు వైసీపీ కోసమని చెప్పి రాజీనామా చేసిన వాలంటీర్లు దాదాపు లక్ష మందికి పైగా ఉన్నారని సమాచారం. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి