Research on Dengue: వందలాది దోమలతో కుట్టించుకునే మనిషి.. కారణం తెలిస్తే శభాష్ అంటారు!

ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ పెరాన్ రాస్ ప్రతిరోజూ వందలాది దోమలతో కుట్టించుకుంటాడు. దోమల నుంచి వ్యాపించే డెంగ్యూ వ్యాధిపై చేస్తున్న పరిశోధనల్లో భాగంగా ఇలా చేస్తున్నట్టు ఆయన చెప్పారు. దోమలతో ఆయన చేస్తున్నఈ సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update
Research on Dengue: వందలాది దోమలతో కుట్టించుకునే మనిషి.. కారణం తెలిస్తే శభాష్ అంటారు!

Research on Dengue: ఒక్క దోమ కుడితే చాలు.. ఆ బాధకు తెగ విసుక్కుంటాం. దోమ కనపడితే ఎక్కడ కుట్టేస్తుందో అని మస్కిటో కాయిల్స్.. దోమల బ్యాట్ పట్టుకుని వాటిని తరిమేసేదాకా మనకి నిద్ర పట్టదు. సింపుల్ గా చెప్పాలంటే.. చిరుత పులి కనపడితే మొబైల్ ఫోన్ తో వీడియోలు తీయడానికి భయపడని మనం.. దోమ కనపడితే మాత్రం ఆమ్మో అంటూ అరుస్తాం. కదా. కానీ, ఒక వ్యక్తి రోజూ 500 పైగా దోమలతో కుట్టించుకుంటున్నాడు. ఎందుకో తెలిస్తే ఆయన చేసే పనికి కచ్చితంగా చప్పట్లు కొట్టి అభినందిస్తారు. మరింకెందుకు ఆలస్యం ఆ కథేమిటో తెలుసుకుందాం.. 

Research on Dengue: ఏదైనా ఒక విషయంపై రీసెర్చ్ చేసేవారు.. దానిని విజయవంతంగా పూర్తి చేసేవరకూ తీవ్రంగా కష్టపడతారు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. ఇదిగో అలానే ఈ శాస్త్రవేత్త కష్టపడుతున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ పెరాన్ రాస్ ఈయన పేరు. ఈయన డెంగ్యూ పై ఒక ప్రత్యేక పరిశోధన చేస్తున్నారు. ఈ పరిశోధనలో భాగంగా ఆయన చేస్తున్న పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఈయన చేస్తున్న పరిశోధన ప్రత్యేకమైనదే కాదు.. దానికోసం ఆయన చేస్తున్న సాహసం ప్రశంసనీయమైనది. 

Research on Dengue: ఈయన  ప్రతిరోజూ వందల కొద్దీ దోమలతో తనను కుట్టుకుంటాడు. వైరల్ అయిన క్లిప్‌లో, ఆయన  దోమలతో నిండిన గాజు పెట్టెలో చేయి పెట్టడం చూడవచ్చు. దోమలు ఆయన చేతిని తేనెటీగలు పట్టును పట్టినట్టు పట్టుకోవడం కనిపిస్తుంది. దోమలు కుట్టిన చోట చేతిపై ఎర్రటి దద్దుర్లు కూడా కనిపిస్తున్నాయి. ప్రతిరోజూ దాదాపు 500 దోమలు తన చేతులను కుడతాయని  డాక్టర్ రాస్ చెప్పారు. కొన్నిసార్లు ఈ సంఖ్య 15,000కు చేరుకుంటుందని ఆయన అంటున్నారు.  ఈ బాధాకరమైన ప్రక్రియ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ వస్తుందా లేదా అని చూడటం. వైరల్ వీడియోలో, దోమలు కుట్టిన తర్వాత, డాక్టర్ రాస్ ప్రపంచంలో ఇంతకంటే ఆహ్లాదకరమైనది మరొకటి లేదని చెప్పడం కూడా వినవచ్చు. అది వృత్తి పట్ల ఆయనకు ఉన్న కమిట్మెంట్ ను సూచిస్తుంది. 

View this post on Instagram

A post shared by 60 Second Docs (@60secdocs)

Research on Dengue: పరిశోధనలో  ముఖ్యమైన ప్రక్రియగా, ల్యాబ్‌లోని దోమల గుడ్లలోకి బ్యాక్టీరియా ఇంజెక్ట్ చేసినట్టు  ఆయన చెప్పారు. ఈ బాక్టీరియా సోకిన గుడ్ల నుంచి వెలువడే ఆడ దోమలు డెంగ్యూను వ్యాప్తి చేయలేవు. దీని తర్వాత, డాక్టర్ రాస్ స్వయంగా ఈ దోమలచే కుట్టించుకుంటాడు.  అతనికి వాటి ద్వారా డెంగ్యూ సోకిందా లేదా అని చెక్ చేసుకుంటారు. ఈ విధంగా, బ్యాక్టీరియా ఉన్న దోమలు డెంగ్యూ వ్యాప్తి చెందే దోమలను ఆపగలవా లేదా అని వారు కనుగొంటారు.

Research on Dengue: డెంగ్యూ అనేది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి, ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రతి సంవత్సరం 40 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల దాదాపు 40 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అదే సమయంలో ఈ వ్యాధి సోకిన వారిలో 80 శాతం మందికి డెంగ్యూ లక్షణాలు కనిపించకపోవడం ఆశ్చర్యకరం. ఈ పరిస్థితి దీనిని  నియంత్రించడాన్ని మరింత సవాలుగా చేస్తుంది. డాక్టర్ రాస్ ఈ పరిశోధన దోమ కాటు వల్ల వచ్చే వ్యాధులను నియంత్రించే రంగంలో ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. అతని సాహసోపేతమైన అడుగులు ఈ దిశలో కొత్త అవకాశాలకు దారితీస్తాయని ఆశించవచ్చు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు