నా కొడుక్కి నటనపై ఆసక్తి లేదు : అకీరా సినీ ప్రవేశంపై రేణూదేశాయ్ క్లారిటీ

పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ హీరో అవుతున్నాడా లేదా, అతడు ముఖానికి రంగేసుకుంటాడా వేసుకోడా, అతడికి హీరోగా మారే ఉద్దేశం ఉందా లేదా.. గడిచిన 3 రోజులుగా ఇదే చర్చ. ఈ మొత్తం చర్చకు ఓ ముగింపు ఇచ్చే ప్రయత్నం చేసింది అకిరా తల్లి రేణుదేశాయ్.

New Update
నా కొడుక్కి నటనపై ఆసక్తి లేదు : అకీరా సినీ ప్రవేశంపై రేణూదేశాయ్ క్లారిటీ

Renu Desai about Akira: "ప్రస్తుతానికి అకిరాకు నటనపై ఆసక్తి లేదు, హీరో అవ్వాలని లేదు. భవిష్యత్తులో అతడు ఏమౌతాడో నేను చెప్పలేను. దయచేసి, నేను ఏది పోస్టు చేసినా ప్రతిసారి దానిపై ఏదో ఒక పుకారు సృష్టించొద్దు. నిజంగా అతడు యాక్టింగ్ కెరీర్ ను ఎంచుకుంటే మాత్రం ఆ విషయాన్ని ముందుగా నేనే అందరికీ చెబుతాను. ఇది నా వాగ్దానం. అకిరా ఇప్పటివరకు నటనవైపు రాలేదు, సినిమాల్లో నటించలేదు. అయినప్పటికీ అతడిపై చాలా నెగెటివిటీ కనిపిస్తోంది."

ఇలా అకిరా ఇప్పట్లో హీరో అవ్వడనే విషయాన్ని రేణుదేశాయ్ ప్రకటించింది. ఈ ప్రకటన కొత్తేంకాదు. గతంలో కూడా ఆమె ఇదే ప్రకటన చేసింది. అయితే ఈసారి రేణుదేశాయ్ ప్రకటనను ఎవ్వరూ నమ్మడం లేదు. ఎందుకంటే, ఓవైపు అకిరాకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదంటూ రేణు దేశాయ్ ప్రకటిస్తే, మరోవైపు అకిరా వెళ్లి న్యూయార్క్ లోని ఫిలింస్కూల్ లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రకటించారు.

సో.. అటు అకిరా చేస్తున్న పనులకు, ఇటు రేణు దేశాయ్ ఇస్తున్న ప్రకటనలకు పొంతన కుదరడం లేదు. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం తాజా పరిణామాలతో పండగ చేసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ నటవారసుడు అకిరా, సినిమాల్లోకి రావడం గ్యారెంటీ అని వాళ్లు ఫిక్స్ అయిపోయారు. 19 ఏళ్ల అకిరా, ఏ క్షణానైనా సినిమాల్లోకి వస్తాడనేది వాళ్ల నమ్మకం.

అకిరా ఇప్పటికే పియానో నేర్చుకున్నాడు. అతడికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మరోవైపు చదువుల్లో కూడా చురుగ్గా ఉన్నాడు. అయితే అతడికి యాక్టింగ్ పై ఆసక్తి ఉందా లేదా అనే విషయాన్ని మాత్రం ఇప్పటివరకు ఎవ్వరూ వెల్ల

Advertisment
Advertisment
తాజా కథనాలు