Unwanted Hair Removal Tips: పటికతో అవాంఛిత రోమాలు పరార్.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా..? యుక్త వయసులోకొచ్చిన అమ్మాయిల్లో అవాంఛిత రోమాల సమస్య ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఇంటి చిట్కాలు ఈ సమస్యకు పరిష్కారం చూపుతాయంటున్నారు నిపుణులు. ఆ చిట్కాలు తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 09 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Unwanted Hair Removal Tips: చందమామ వంటి అందమైన ముఖం కావాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది. అయితే.. చాలామంది అమ్మాయిలకు పైపెదవి భాగంలో, గడ్డం దగ్గర వెంట్రుకలు వచ్చి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా అప్పర్ లిప్, గడ్డం దగ్గర పెరిగిన వెంట్రుకలను తొలగించుకోవడానికి అమ్మాయిలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అంతేకాదు.. అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి థ్రెడింగ్, వ్యాక్సింగ్ చేయిస్తారు. ఇలా చేస్తే విపరీతమైన నొప్పితోపాటు, అవాంఛిత రోమాలు పెరిగే అవకాశం ఉంది. అవాంఛిత రోమాలతో ముఖం రంగు తగ్గటంతో పాటు అసహ్యంగా, ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ఇబ్బంది ఉంటే బయటకు వెళ్లాలన్నా భయంగా ఉంటుంది. అలాంటప్పుడూ కొన్ని సింపుల్ ఇంటి రెమిడీలు ఫాలో అయితే సులభంగా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇలా వాడితే.. అప్పర్ లిప్, గడ్డం దగ్గర సైడ్ ఎఫెక్ట్‌లు కూడా రావని నిపుణులు చెబుతున్నారు. హెయిర్‌ను సులభంగా తొలగించుకునే ఆ సింపుల్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం. పటికతో అవాంఛిత రోమాలు దూరం ముఖాన్ని రాత్రి పడుకునే ముందు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిన తరువాత అలోవెరా జెల్, కొబ్బరి నూనె, మాయిశ్చరైజర్, గ్లిజరిన్ వంటివి ఏదైనా ఒకటి రాసుకోని 10 నుంచి 15 నిమిషాలు మర్దన చేసుకోవాలి. తరువాత లైట్ ఆపేసి 20 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టాలి. ప్రతీరోజూ ఇలా చేస్తే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అంది రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది. దీని ఫలితంగా ముఖం మెరుపుతోపాటు చర్మం రంగు మారి అందంగా కనిపిస్తారు. ఇది కూడా చదవండి: క్యాప్సికం, స్ప్రింగ్ ఆనియన్స్ ఎప్పుడూ తాజాగా ఉండాలంటే ఇలా చేయండి అంతేకాకుండా.. కొద్దిగా పటికపొడిలో పసుపు, రోజ్ వాటర్, నిమ్మరసం వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని ముఖంపైన పూతలా రాసుకోవాలి. తరువాత పూర్తిగా ఆరినక వేళ్లతో సర్కిల్స్‌లా 5 నుంచి 10 నిమిషాలు రుద్దుకోవాలి. అనతరం చల్లని నీటితో ముఖం శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా వారానికి 2 నుంచి 3 సార్ల చేస్తే ముఖం మీద ఉండే అవాంఛిత రోమాలు రాలిపోతాయి, చర్మ రంగు కూడా మారుతుంది. ఇంక ఏమైనా చర్మ సమస్యలు ఉంటే వైద్యుల్ని సంప్రదించి వాళ్ల సూచనలు పాటించడం చాలా మంచిది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #unwanted-hair #removal-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి