Naradishti: ఇంట్లో నరదిష్టి పోవాలంటే వెంటనే ఈ పరిష్కారాలు చేసుకోండి మనపై పడే దృష్టిలో మంచి, చెడూ రెండూ ఉంటాయని పండితులు అంటున్నారు. కొందరి కంటి చూపు మనపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది అంత మంచిది కాదు. ఆ భయంకరమైన నరదిష్టి నుంచి బయటపడే విషయాలను తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి. By Vijaya Nimma 07 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Naradishti: ఈరోజుల్లో అందరిని పీడిస్తున్న సమస్యల్లో నరదిష్టి ఒకటి. యుగాల తరబడి నరదిష్టి అనేది ఉంది. ద్వాపర యుగంలోనూ కృష్ణుడు నరదిష్టితో బాధించబడ్డారని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవానికి కొందరి కంటి చూపు మనపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది అంత మంచిది కాదు. మనపై పడే దృష్టిలో మంచి, చెడూ రెండూ ఉంటాయి. ఒక పనిచేస్తే మనసులో ఏం పెట్టుకోకుండా పొగిడేవాళ్లు ఉన్నారు. ఈర్ష్య, అసూయతో తిట్టుకునేవారూ ఉంటారు. ఆ సమయంలో మనకు నరదిష్టి తగులుతుంది. దీంతో అనేక ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అనే సామెత మన పెద్దల వాడుకలో ఉండేది. ఆ భయంకరమైన నర దిష్టి నుంచి బయటపడాలంటే కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నారులకు నరదిష్టి బాగా తగులుతుంది. దృష్టి దోషంతో కడుపునొప్పి, ఏడవడం, బలహీనపడటం జరుగుతుంది. అంతేకాకుండా పెద్దవారిలో అయితే కుటుంబ కలహాలు, డబ్బులు ఉండకపోవడం, అనారోగ్యం వంటివి తలెత్తుతాయి. నరదిష్టిని మొత్తానికి పోగొట్టుకులేకపోయినా చిన్న పరిహాలు చేసుకుంటే సరిపోతుందని పండితులు అంటున్నారు. పాతకాలంలో చిన్నపిల్లలకు తాయిత్తులు కట్టించేవారు. దిష్టితగిలిందని భావిస్తే కొబ్బరికాయ తిప్పడం, నిమ్మకాయను దిష్టితీయడం, గుమ్మడికాయను చుట్టూ తిప్పి కొట్టడం, ఉప్పు, ఎండుమిర్చితో దిష్టి తీసేవారు. ఇళ్లకు కూడా దిష్టితగులుతుంది. దానికి రాక్షసుడి బొమ్మపెట్టడం, ఇంటికి గుమ్మడిని వేలాడదీయడంలాంటివి చేస్తుంటాం. దిష్టిపోవాలంటే యజ్ఞం చేసిన తర్వాత లభించే బృహస్రామాన్ని తిలకంలా ధరిస్తే సరిపోతుంది. గృహప్రవేశం సమయంలో హోమం, యజ్ఞాలు చేయడం వల్ల దిష్టిపోతుంది. ఇళ్లలోకి వెళ్లేటప్పుడు వాస్తుబలి ఇస్తుంటారు. పరిహారాలతో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు అంటున్నారు. ఇది కూడా చదవండి: మగవారికి పొంచిఉన్న ముప్పు..ఆ సమస్య తప్పదా..? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #home-tips #naradishti మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి