New Year 2024: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రికార్డు.. హైదరాబాద్ లో ఒక్క రాత్రే ఎంత మంది దొరికారంటే? కొత్త ఏడాది వేడుకల వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మహిళలతో సహా 1239 మంది పై కేసులు నమోదు చేశారు. By Bhoomi 01 Jan 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి కొత్త ఏడాది వేడుకల వేళ హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and drive) నిర్వహించారు. రికార్డు స్థాయి మించి మందు బాబులు పోలీసులకు పట్టుబట్టారు. డ్రైవ్ లో మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మహిళలతో సహా 1239 మంది పై కేసులు నమోదు చేశారు. పోలీసులు కొత్త సంవత్సరం వేడుకల (New Year Celebrations)కు వారం రోజుల ముందే నుంచే హెచ్చరికలు జారీ చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినా...పోలీసుల మాటలను బేకాతర్ చేశారు మందు బాబులు. డిసెంబర్ 31 అర్థరాత్రి మందు బాబులు కిక్కెక్కించే మత్తుతో రెచ్చిపోయారు. మందు తాగుతూ రోడ్లపై వీరంగం చేశారు. మందుతాగి డ్రైవ్ చేసితే..ఫైన్ తోపాటు జైలు శిక్ష తప్పదని పోలీసులు స్పష్టం చేశారు. అయినప్పటికీ సైబరాబాద్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మహిళలతోపాటు 1239మంది కేసులు నమోదు చేశారు. 938 టూవీలర్స్, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పరిధిలో 1500లకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా పోలీసులు తనిఖీల్లో కొంతమంది వాహనాదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా న్యూ ఇయర్ వేళ జనం ఫుల్ జోషులో ఉన్నారు. 2023కు ఘనంగా వీడ్కోలు పలుకుతూ 2024 నూతన సంవత్సరానికి హ్యాపీగా స్వాగతం పలికారు. ఈ యేడాది పలు కొత్త పనులను ప్రారంభించడంతోపాటు, శుభకార్యాలకు శ్రీకారం చుట్టారు. అయితే యువత మాత్రం మత్తులో మునిగిపోయింది. మూడ్రోజులుగా పార్టీ (party) ల పేరుతో తాగి ఊగిపోతున్నారు. తెలంగాణ (Telangana) లో గతేడాదికంటే ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు మరింత పెరిగినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా లిక్కర్ (liquor) అమ్మకాలతో రాష్ట్రానికి భారీ ఖజానా చేకూరినట్లు తెలుస్తోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం.. ఈ మూడ్రోజుల్లో రూ. 658 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 29, 30, 31 తేదీల్లో భారీగా మద్యం అమ్మకాలు పెరిగాయని, ఇప్పటి వరకూ 6.31 లక్షల బీర్ కేసుల విక్రయించినట్లు చెప్పారు. ఇక రాత్రి ఒంటిగంట వరకు ఈవెంట్ల నిర్వహణకు పర్మిషన్ ఇవ్వడంతో లిక్కర్ సేల్స్ పుంజుకున్నాయని, కేవలం 30 తారీఖు ఒక్కరోజే రూ. 313 కోట్ల లిక్కర్ అమ్ముడు పోయినట్లు వెల్లడించారు. అలాగే ఈ 3 రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కు సంబంధించిన పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: ఇస్రో PSLV-C58 మిషన్ విజయవంతం..తొలిసారిగా భారత్ పోలారి మెట్రి మిషన్..!! #drunk-and-drive #new-year-2024 #new-year-celebrations మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి