టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అగార్కర్‌నే ఎందుకు ఎంపిక చేశారంటే..! తాజాగా టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు జట్టును అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. వరుసగా ఆసియా కప్, ప్రపంచ కప్ వంటి టోర్నీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అగార్కర్ ఎంపికకు కొన్ని కారణాలున్నాయని చెబుతున్నారు సెలెక్టర్స్. అయితే ఉన్నట్టుండి అగార్కర్ పేరు తెరమీదకు రావడం, అగార్కర్ బ్యాగ్రౌండ్ ఏంటోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. By Shareef Pasha 05 Jul 2023 in నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి వన్డే ప్రపంచ కప్ తో పాటు టీ20 వరల్డ్ కప్ జట్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో టీ-20లు ఆడిన అనుభవంతో పాటు ఈసారి చీఫ్ సెలెక్టర్‌గా యువ అభ్యర్థిత్వం ఉంటే బాగుంటుందని బీసీసీఐ భావించింది. అయితే గతంలో అగార్కర్ కామెంటరీతో పాటు కోచింగ్ బాధ్యతలను నిర్వర్తించాడు. సెలెక్టర్ గాను అతనికి ఇదే మొదటిదేం కాదు. గతంలో ముంబై క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా వర్క్ చేసిన అనుభవం ఉంది. ఐపీఎల్‌లో ఢిల్లీకి సహాయక కోచ్‌గా బాధ్యతలను నిర్వర్తించాడు. క్రికెట్ విశ్లేషకుడిగానూ.. అగార్కర్‌కి అనుభవం ఉంది. ఆటను సునిశితంగా పరిశీలిస్తాడు. అగార్కర్ భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో 349 వికెట్లు తీశాడు. అన్ని విభాగాలపై పట్టుంది. ఆటగాళ్ల బలా,బలాలను అంచనా వేయడంలో తనకు తానే దిట్టని చెప్పాలి. చీఫ్ సెలెక్టర్ పదవి కోసం అగ్రశ్రేణి ఆటగాళ్ల వైపు బీసీసీఐ వెళ్లకపోవడానికి పారితోషికం మరో ప్రధాన అంశంగా చెబుతున్నారు. చీఫ్ సెలక్టర్ గా ఎంపికైన వారికి ప్రస్తుతం రూ.1 కోటి వేతనం ఉంటుంది. మాజీ అగ్ర శ్రేణి ఆటగాళ్లకు ఇది చాలా తక్కువ అనిపిస్తుంది. అగార్కర్ వ్యాఖ్యాతగా ఇంతకంటే ఎక్కువగానే సంపాదించుకోవచ్చు. దీంతో వేతన ప్యాకేజీని రూ.3 కోట్లకు పెంచేందుకు బీసీసీఐ అంగీకరించిందని తెలుస్తోంది. అగార్కర్ ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నాడు. ఒక క్రికెట్ లెజెండ్ అగార్కర్‌ను దీనికోసం ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఈ పదవి కోసం అగార్కర్ ఒక్కడే దరఖాస్తు చేసుకున్నాడని సమాచారం. దీంతో క్రికెట్ సలహా కమిటీ అగార్కర్‌ను మాత్రమే ఇంటర్వ్యూ చేసి, అతని అనుభవం, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని దీనికి బీసీసీఐ ఎంపిక చేసినట్లు సమాచారం. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి