Insurance Policy: ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? ఇలా చేయకపోతే దొరికిపోతారు! సాధారణంగా ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నపుడు పాలసీ నిబంధనలు చదవకుండానే పాలసీ కాగితాలపై సంతకాలు చేసేస్తారు. కానీ, ఏజెంట్ చెప్పిన మాటలు వినకుండా అన్ని నిబంధనలు చదివి అర్ధం చేసుకునే సంతకం చేయడం మంచిది. అలా ఎందుకు చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 30 May 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Insurance Policy: ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ అగ్రిమెంట్ లేదా ఫారమ్‌లలో ఉండే అన్ని కాలమ్స్ మనం చదవడానికి మనం సాధారణంగా ఇబ్బంది పడతాము. ఎందుకంటే, అవి చాలా పేజీలు ఉంటాయి.. అన్నీ ఎక్కడ చదువుతాములే.. టైమ్ వెస్ట్ అని అనుకుంటాం. అయితే, ఇందులో ఉండే చాలా నియమాల గురించి మనకు ఇన్సూరెన్స్ ఏజెంట్ వివరణ ఇవ్వడు లేదా వివరంగా చెప్పడు. ఇన్సూరెన్స్ విషయంలోనే కాకుండా అనేక ఆర్థిక లావాదేవీల్లో కూడా మన విధానం ఇలాగే ఉంటుంది. ఏజెంట్‌పై ఉదాసీనత లేదా నమ్మకం మనల్ని అప్రమత్తంగా ఉండకుండా చేయవచ్చు. అలాంటి పరిస్థితిలో చాలా సార్లు ఏజెంట్లు వ్యాపారాన్ని తప్పుదారి పట్టించే కొన్ని అంశాలను ప్రస్తావించరు. దీని వల్ల భవిష్యత్తులో మనకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. Insurance Policy: ఉదాహరణకు, ఇన్సూరెన్స్ చేయించుకున్న వ్యక్తికి దీర్ఘకాలిక గుండె జబ్బు ఉంటుంది. వారు ఇన్సూరెన్స్ చేస్తారు. పాలసీ తీసుకున్న ఏడాదిలోపే వ్యాధి బారిన పడి మరణిస్తారు. అప్పుడు కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ సొమ్మును క్లెయిమ్ చేసేందుకు ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదిస్తారు. కానీ, అతని దురదృష్టవశాత్తు ఆ క్లెయిమ్‌ను కంపెనీ తిరస్కరిస్తుంది. కారణం ఏమిటంటే, మరణించిన పాలసీదారు ఇన్సూరెన్స్ చేస్తున్నప్పుడు చాలా కాలంగా తనకు ఉన్న ఈ వ్యాధిని వెల్లడించలేదు. Insurance Policy: చాలా మంది ఈ తప్పు చేస్తుంటారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు రిజెక్ట్ అవడానికి ఇది చాలా సాధారణ కారణాలలో ఒకటిగా ఉంటుంది. ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ - పాలసీదారు మధ్య ఒప్పందం లాంటిది. దీనిలో చాలా నిబంధనలు.. షరతులు ఉంటాయి. ఆయా కంపెనీల పాలసీల ఆధారంగా ఇటువంటి పరిస్థితులు మారవచ్చు. ఇక్కడ కొన్ని నిబంధనలు - షరతులు అర్థం కాకపోవచ్చు. మీకు అర్థం కాకపోతే సంతకం చేయవద్దు. ఏజెంట్‌ని అడిగి క్లియర్ గా ఆవిషయాన్ని అర్ధం చేసుకున్నాకే సంతకం చేయండి. అనారోగ్యం గురించి సమాచారాన్ని దాచవద్దు Insurance Policy: ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు మీరు ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, దానిని తప్పనిసరిగా పేర్కోవడం మంచిది. ఏజెంట్ చెప్పిన దానితో సరిపెట్టుకోవద్దు. మీరు అందించిన ఏదైనా తప్పుడు సమాచారం మీ పాలసీ రద్దుకు దారితీయవచ్చు. ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను మాత్రమే ప్రస్తావించడం సరిపోదు. అంతే కాకుండా సిగరెట్ తాగడం వంటి చెడు అలవాట్లు ఉంటే వాటి గురించి కూడా తప్పకుండా తెలియజేయాలి. ఈ విషయాలు తెలియకపోతే పాలసీదారు మరణించినపుడు నష్టపోతారు.. పాలసీ పత్రంలో పాలసీదారు మరణ ప్రయోజనాలపై ఒక విభాగం ఉంటుంది. దానిని శ్రద్ధగా చదవాలి. పాలసీదారు మరణిస్తే క్లెయిమ్ డబ్బులో కొంత భాగాన్ని ఎందుకు నిలిపివేస్తారో తెలుసుకోవడానికి దీన్ని ముందుగా చదవండి. నిర్ణీత వ్యవధిలోగా పాలసీదారు ఆత్మహత్య చేసుకుంటే, అటువంటి సందర్భంలో చాలా పాలసీలలో డెత్ క్లెయిమ్ చెల్లించరు. చట్టవిరుద్ధమైన, నేరపూరిత కార్యకలాపాలలో పాలుపంచుకున్నప్పుడు ఇన్సూరెన్స్ చేసుకున్న వ్యక్తి మరణిస్తే మరణ ప్రయోజనం కోసం క్లెయిమ్ కూడా ఉండదు. అలాగే ప్రసవ సమయంలో తల్లి చనిపోయినా చాలా పాలసీలు కవరేజీని అందించవు. కొన్ని విమానయాన సంస్థలు ప్రైవేట్ విమాన ప్రయాణంలో ప్రమాదం కారణంగా మరణిస్తే మరణ పరిహారం క్లెయిమ్‌లను అందించవు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మందు తాగి డ్రైవింగ్ చేయడం లేదా సీటు బెల్ట్ ధరించకుండా వేగంగా నడపడం వల్ల ప్రమాదవశాత్తు మరణిస్తే కవరేజీని అందించడం లేదు. చాలా పాలసీలు యుద్ధం కారణంగా మరణిస్తే కవర్ అందించవు. చివరగా ఒక మాట.. పాలసీ తీసుకునేటప్పుడు, మీరు ఒప్పందాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. మీ పాలసీ కవరేజీని నిలిపివేసే లేదా పరిమితం చేసే అంశాలు ఉన్నాయని గమనించండి. దీని గురించి మీ ఏజెంట్‌ని అడగండి, ప్రతి విషయాన్ని గుడ్డిగా విశ్వసించకండి. పన్ను ప్రయోజనం, లాక్-ఇన్ పీరియడ్, నామినీ వంటి అనేక అంశాలు పాలసీ డాక్యుమెంట్‌లలో ఉంటాయి. అలాంటి వాటి గురించి అడగండి. బాగా అర్థం చేసుకోండి. లేకుంటే అది మీకు నష్టాన్ని కలిగించవచ్చు. #insurance #insurance-rules మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి