విడాకులపై స్పందించిన నిహారిక కొణిదెల మెగా బ్రదర్ నాగబాబు ఏకైక కుమార్తె, నటి నిహారిక కొణిదెల కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి ఆమె విడాకులు కోరుతున్నారని, మనస్పర్థలు రావడంతోనే ఇరువురు విడిపోయి, విడివిడిగా ఉంటున్నారనే విషయాలు బయటకొచ్చాయి. అయితే విడాకుల కోసం నిహారిక, చైతన్య జొన్నలగడ్డ కోర్టు మెట్లు ఎక్కారు. అయితే తమ దాంపత్య జీవితంపై చైతన్య సోషల్ మీడియా వేదికగా స్పందించాడు తాజాగా.. నాగబాబు కూతురు నిహారిక సైతం స్పందించారు. By Shareef Pasha 05 Jul 2023 in సినిమా Scrolling New Update షేర్ చేయండి గతసంవత్సరం పెళ్లి, అంతలోనే.. 2020 డిసెంబర్‌లో నిహారిక, చైతన్యల వివాహం రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ కోటలో అంగరంగవైభవంగా జరిగింది. కొన్ని నెలల క్రితం ఆగస్టు 13న హైదరాబాద్ సిటీలో నిశ్చితార్థం జరిగింది. నిహారిక పెళ్ళికి మెగా ఫ్యామిలీ అంతా పుల్‌గా ఎంజాయ్ చేశారు. ఇండస్ట్రీ నుంచి కొద్దిమంది అతిథులను ఆహ్వానించారు. పెళ్లి తర్వాత కొన్ని రోజులు అంతా సజావుగానే ఉంది. చైతన్యను సినిమా వేడుకలకు నిహారిక తీసుకువచ్చేవారు. తాను నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ వెబ్ సిరీస్ ఫంక్షన్‌లో భర్తతో కలిసి సందడి చేశారు. ఇద్దరూ కలిసి ఫారిన్ టూర్లు వేశారు. ఇంతలోనే ఏమైందో ఏమో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. కారణాలు ఏంటో తెలియదు గానీ చైతన్య ఫోటోలను నిహారిక డిలీట్ చేయడంతో సినిమా ఇండస్ట్రీ వర్గాలతో పాటు మెగా ఫ్యాన్స్‌కు డౌట్ వచ్చింది. ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకొచ్చింది. భర్తతో కలిసి ఉన్న ఫోటోలను తీసేసిన నిహారిక అయితే.. ఇన్‌స్టాలో భర్తలో కలిసి ఉన్న ఫోటోలను నిహారిక డిలీట్ చేసిన తర్వాత చైతన్య కనిపించడం మానేశారు. ఇటీవల.. వరుణ్‌తేజ్, లావణ్యా త్రిపాఠి నిశ్చితార్థం జరిగింది. ఆ వేడుకల్లోనూ చైతన్య జొన్నలగడ్డ ఎక్కడా కనిపించలేదు. అన్న, వదినతో కలిసి దిగిన ఫోటోను నిహారిక షేర్ చేయగా ఆయన ఎక్కడా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే తాజాగా వీరిద్దరు కలిసి విడాకులకు దరఖాస్తు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. అయితే ఇదిలా ఉంటే తాజాగా నిహారిక సోషల్‌మీడియా ద్వారా స్పందించడంతో అసలు మ్యటర్‌కు తెర తీసినట్లు అయింది. విడాకులపై నిహారిక స్పందన.. వారిద్దరి విడాకులపై నిహారిక ఇలా స్పందిస్తూ.. చైతన్య, నేను పరస్పర అంగీకారంతో విడిపోయాము. మాకు అండగా నిలిచిన కుటుంబసభ్యులు స్నేహితులకు ధన్యవాదాలు. మా వ్యక్తిగత జీవితానికి సంబందించిన విషయాలపై ప్రైవసీ కి కోరుకుంటున్నామంటూ నిహారిక కొణిదెల రిప్లై ఇచ్చారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి