బైజూస్ కి ఏమైంది? ..!!

ఇంతకి బైజూస్ కి ఏమైంది?నిన్నటి వరకూ ఓ వెలుగు వెలిగిన సంస్థ ఇప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ సంస్థ యజమాని వచ్చిన కష్టమేంటి?

New Update
బైజూస్ కి ఏమైంది? ..!!

publive-image

జీవితం ఎప్పుడూ ఒకేరకంగా ఉండదు. కొన్నిరోజులు మనమెంతో ఆనందంగా జీవిస్తే...ఇంకొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే ఉన్నాయనిపిస్తుంది. జీవితం ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎవరూ తీర్చలేని కష్టాన్ని చూడాల్సి వస్తుంది. అలాంటి కష్టమే వచ్చింది బైజూస్ సీఈవో రవీంద్రకు. ఈఎడ్ టెక్ స్టార్టప్ బైజూస్ భారత్ తోపాటు, ప్రపంచ దేశాల స్టార్టప్స్ కు ఒక రోల్ మోడల్ గా నిలించింది. విద్యార్థులకు ఈజీగా అర్థమయ్యే భాషలో..ఎంతో క్లిష్టమైన సబ్జెక్టును కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది బైజూస్. తక్కువ కాలంలోనే ఎక్కువమంది ఆదరణ పొందింది. విద్యాసంస్థలు మొదలుకుని రాష్ట్రప్రభుత్వాల వరకు బైజూస్ తో ఒప్పందాలు కుదుర్చుకునే స్థాయికి ఎదిగింది. అయితే ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తోంది బైజూస్. ఉద్యోగుల లేఆఫ్స్, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి నిధులు నిలిచిపోవడం, బోర్డు డైరెక్టర్లు వైదొలగడం, ఆడిటర్ వెళ్లిపోవడం...ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి.

ఇవేకాదు ఏప్రిల్ చివరిలో బైజూస్ బెంగళూరు కార్యాలయంపై ఈడీ దాడి జరిగింది. ల్యాప్ ట్యాప్ లను స్వాధీనం చేసుకున్నారు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఎలాంటి కేసులు నమోదు కాలేదు కానీ...అంతర్జాతీయంగా బైజూస్ పరువంతా గాలిలో కలిసిపోయింది. అత్యంత విలువైన విద్యా సాంకేతిక స్టార్టప్ ను బహిరంగంగా విదేశీ మారకపు ఉల్లంఘనలతో ముడి పెట్టేశారు. వరుస కష్టాల్లోకి వెళ్లిన రవీంద్రన్...పెట్టుబడిదారులతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈడీ దాడుల అనంతరం దుబాయ్ లో పలువురు ఇన్వెస్టర్లతో సమావేశమయ్యారు రవీంద్రన్. 1 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణ విషయంపై ఇన్వెస్టర్లతో మాట్లాడారు. కంపెనీని కాపాడుకునేందుకు కన్నీంటిపర్యంతమైనట్లు తెలుస్లోంది. ఈ సమావేశంలో రవీంద్రన్ కన్నీళ్లు పెట్టుకున్నారని కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని తమతో పంచుకున్నట్లు బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది. ఇక రవీంద్రన్ గతకొన్నాళ్ల నుంచి తీవ్ర సంక్షోభంలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ లో ఈడీ చేసిన దాడితోపాటుగా, ఆర్ధిక ఖాతాలను సకాలంలో ఫైల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎన్నో యూఎస్ ఆధారిత పెట్టుబడిదారులు బైజూస్ అర బిలియన్ డాలర్లను దాచిపెట్టారంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. బైజూస్ తొలి పెట్టుబడిదారులలో ఒకరు ప్రోసస్ ఎన్వీ బోర్డు నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నారు. డైరెక్టర్ల తీరుపై అసహనంతోనే బోర్డు నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు.

రవీంద్రన్ గురించి....
కేరళలోని మారుమూల గ్రామంలో జన్మించారు రవీంద్రన్.తొలినాళ్లలో బెంగుళూరులో విద్యార్థులకు ట్యూషన్లు చెప్పేవాడు. రవీంద్రన్ బోధనా పద్ధతులు విద్యార్థులను ఎంతో ఆకర్షించేవి. తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించారు రవీంద్రన్. థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక కోచింగ్ సెంటర్ ను ప్రారంభించారు. బైజూస్ ప్రస్థానం అక్కడి నుంచే మొదలయ్యింది. టెలికం రంగంలో సంచలనం క్రియేట్ చేసిన రిలయన్స్ జియో ఎంట్రీతో బైజూస్ కు మంచి ఆదరణ వచ్చింది. పెద్దెత్తున పెట్టుబడులు వచ్చాయి. కోవిడ్ కాలంలో ఆన్ లైన్ విద్యకు డిమాండ్ పెరగడంతో...కొన్ని కంపెనీలు బైజూస్ ను కొనుగోలు చేశాయి. కానీ 2022 నుంచి బైజూస్ కు కష్టాలు షురూ అయ్యాయి. ఆన్ లైన్ ట్యూషన్లకు ఆదరణ తగ్గింది. అంతర్జాతీయంగా పరిస్థితులు తలకిందులు కావడం...పెట్టుబడులకు కంపెనీలు ముఖం చాటేయడం ఇలా కంపెనీని కష్టాల్లోకి నెట్టేశాయి. 2023 నాటికి బైజూస్ నాలుగేళ్ల కనిష్టానికి దిగజారింది.

కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నియామకంలో రవీంద్రన్ ఆలస్యం చేయడంపై గ్లోబల్ ఇన్వెస్టర్లు ఆగ్రహించారు. పాఠశాలలు,కాలేజీలు ప్రారంభంకావడంతో వందలమంది ఉద్యోగులను కంపెనీలో నుంచి తీయాల్సి వచ్చింది. బోర్డు సభ్యులు కూడా రాజీనామా చేశారు. దేశవ్యాప్తంగా చాలా బైజూస్ టీచింగ్ సెంటర్లలో విద్యార్థులు లేక ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటున్న రవీంద్రన్ తన ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు వైరల్ అవుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు