Ravi Teja : రవితేజను ఉద్దేశిస్తూ హరీష్ శంకర్ ట్వీట్.. ఓవర్ చెయ్యకంటూ రిప్లై ఇచ్చిన మాస్ రాజా! డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా మిస్టర్ బచ్చన్ షూటింగ్ లో రవితేజని ఫోటో తీసాడు. ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి.." ప్రపంచంలో అందరికీ వయసొస్తోంది. అన్నయ్యకి తప్ప' అని పోస్ట్ పెట్టాడు. దీనికి రవితేజ 'ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలా ఉంది' అని రిప్లై ఇచ్చాడు. By Anil Kumar 23 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Ravi Teja Reply To Harish Shankar's Tweet : టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ - మాస్ మహారాజా రవితేజల మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్స్ లో హరీష్ శంకర్ కూడా ఒకరు. 'షాక్' సినిమాతో ఆయన దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత ' మిరపకాయ్' తో ఫస్ట్ సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు మాస్ రాజాతో కలిసి మూడోసారి సినిమా చేస్తున్నాడు. 'మిస్టర్' బచ్చన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ సినిమాకి సంబంధించి హరీష్ శంకర్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఉంటాడు. ఈక్రమంలోనే తాజాగా మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan Movie) సాంగ్ షూటింగ్ లో రవితేజని ఫోటో తీసి ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి.." ప్రపంచంలో అందరికీ వయసొస్తోంది. అన్నయ్యకి తప్ప. కాశ్మీర్ వ్యాలీలో షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే హైదరాబాద్ లో దిగుతాము" అని మిస్టర్ బచ్చన్ సినిమా అప్డేట్ ఇస్తూ పోస్ట్ చేశాడు. Also Read : విజయ్ ‘గోట్’ నుంచి సెకెండ్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న మెలోడీ సాంగ్! నీ దిష్టే తగిలేలా ఉంది... అయితే హరీష్ శంకర్ ట్వీట్ కి తాజాగా రవితేజ రిప్లై ఇస్తూ..' ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలా ఉంది' అని రిప్లై ఇచ్చాడు. దీంతో రవితేజ ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్స్, రవితేజ ఫ్యాన్స్ వీళ్లిద్దరి బాండింగ్ పై కామెంట్స్ చేస్తున్నారు. అజయ్ దేవగన్ 'రైడ్' మూవీకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని దసరా టైం కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Over cheyaku roiiiii .. Nee dishtey tagilela undhi..!! https://t.co/Rr57r1APYP — Ravi Teja (@RaviTeja_offl) June 23, 2024 #ravi-teja #harish-shankar #mr-bacchan-shooting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి