/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ration-cards-cancelled-jpg.webp)
Ration Cards Cancelled : తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులు రద్దు చేసినట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. మేడ్చల్ జిల్లాలో ఏకంగా 95,040 రేషన్ కార్డులు (Ration Cards) రద్దయ్యాయంటూ.. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా భారీగా రేషన్ కార్డు రద్దు అవుతాయంటూ సోషల్ మీడియా వేదికగా చర్చ సాగింది. రేషన్ కార్డుల రద్దు అంశంపై స్పందించిన ఎంపీ అసద్ (Asaduddin Owaisi) స్పందించారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ట్విట్టర్ వేదికగా కోరారు.
ALSO READ: మరుగుదొడ్ల వద్ద వైసీపీ బోర్డు.. జగన్ పై లోకేష్ సెటైర్లు!
ఆ వార్తలు ఫేక్..
రేషన్ కార్డులు రద్దు అవుతాయి అంటూ జరుగుతున్న ప్రచారానికి తెర వేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎంపీ అసద్ అడిగిన దానికి ఆయన వివరణ ఇచ్చారు. రేషన్ కార్డుల రద్దుపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. రద్దు అనుకుంటూ జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తమని అన్నారు. ఒక్క రేషన్ కార్డును కూడా రద్దు చేయలేదని ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు. రాబోయే రోజుల్లోనూ రేషన్ కార్డుల రద్దు ఉండదు అని తేల్చి చెప్పారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది జనాలు ప్రజా పాలన(Praja Palana) కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఇలాంటి వార్త రావడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.
Asad, this news of cancellation of ration cards is totally false. Let me assure you, not one single ration card has been cancelled anywhere in the state by our Government. @asadowaisi https://t.co/sOyDEAfEo0
— Uttam Kumar Reddy (@UttamINC) January 4, 2024
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల కోసమే..
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పథకాలను(Congress 6 Guarantees Scheme) లబ్ధి దారులకు అందించడం కోసం ప్రజా పాలన కార్యక్రమం కింద ప్రజల నుంచి దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తులలో ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల కోసమే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అర్హులకు కొత్త రేషన్ కార్డులను గత ప్రభుత్వం మంజూరు చేయలేదు.
ALSO READ: వైఎస్సార్ మరణంపై అనుమానాలు ఉన్నాయి.. సజ్జల సంచలన కామెంట్స్