Gurukul Students : గురుకుల హాస్టల్ లో విద్యార్థినులను కొరికిన ఎలుకలు! మెదక్ జిల్లాలోని ఓ సాంఘిక గురుకుల హాస్టల్ లో ఎలుకలు కొరకడంతో 12 మంది విద్యార్థినులు గాయపడ్డారు.బుధవారం రాత్రి 12 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. విషయం తెలిసి విద్యార్థినుల తల్లిదండ్రులు గురువారం హాస్టల్‌కు చేరుకుని సిబ్బందిని ఈ విషయం గురించి నిలదీశారు. By Bhavana 12 Jul 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Medak District : మెదక్ జిల్లాలోని ఓ సాంఘిక గురుకుల హాస్టల్ (Gurukul Hostel) లో దారుణం జరిగింది. హాస్టల్ లో ఎలుకలు కొరకడంతో 12 మంది విద్యార్థినులు గాయపడ్డారు. రామాయంపేటలోని కాళ్లగడ్డ వద్ద ఉన్న గురుకుల పాఠశాలకు చెందిన 9 వ తరగతి విద్యార్థినులు వసతి గృహంలో ఎలుకల బెదడ తీవ్రంగా ఉండడంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 12 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. విషయం తెలిసి విద్యార్థినుల తల్లిదండ్రులు గురువారం హాస్టల్‌కు చేరుకుని సిబ్బందిని ఈ విషయం గురించి నిలదీశారు. ప్రిన్సిపాల్ కలుగజేసుకుని విద్యార్థినులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు నచ్చజెప్పి పంపారు. విద్యార్థినులు (Students) మీడియాకు ఎలుకలు కరిచిన గాయాలను చూపించారు. రాత్రిపూట ఎలుకలు (Rats) నిద్రపోనివ్వడం లేదని, హాస్టల్ ఆవరణలో కుక్కలతోనూ భయంగా ఉన్నదని తెలిపారు. హాస్టల్‌లో విద్యార్థినులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామని ప్రిన్సిపాల్ సరళాదేవి పేర్కొన్నారు. Also read: హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం #medak #rats #gurukul-hostel #hostel-students మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి