Kachidi Fish: వామ్మో.. ఈ చేప ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

గోదావరి జిల్లాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్న చేప ఏది అంటే టక్కున పులస అని చెబుతాం. పులస చేపకు అంత క్రేజ్ ఉంటుంది మరి. అందుకే పుస్తెలమ్మైనా సరే పులస చేపలు తినాలి అని అంటుంటారు. కానీ పులస కంటే ఎక్కువ ధర పలికే చేపలు అరుదుగా లభిస్తూ ఉంటాయి. అదే కచిడి చేప. కాకినాడ జిల్లాల్లో దొరికిన ఈ చేప మత్స్యకారులకు లక్షలు సంపాదించి పెట్టింది.

New Update
Kachidi Fish: వామ్మో.. ఈ చేప ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Kachidi Fish

పులస కంటే ఈ చేపలకే క్రేజ్ మరి..

పులస చేపలకు గోదావరి జిల్లాల్లో ఉండే క్రేజ్ వేరు. అయితే కొన్నిసార్లు పులస చేపల కంటే అరుదైన చేపలు మత్స్యకారులకు లాభాలు తెచ్చిపెడుతుంటాయి. అలాంటి ఓ చేప కాకినాడ మత్స్యకారులకు దొరికింది. అనేక ఔషధగుణాలు ఉండే కచిడి చేప కాకినాడ కుంభాభిషేకం రేవులో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు చిక్కింది. 25కేజీల బరువు ఉన్న ఈ చేపను వేలంపాట వేయగా దీనిని దక్కించుకునేందుకు విపరీతంగా పోటీపడ్డారు. చివరకు ఓ వ్యాపారి రూ.3లక్షల 10 వేల రూపాయలకు దక్కించుకున్నారు. దీంతో ఆ మత్స్యకారుల పంట పడింది. వేలం పాటలో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తికి రూ.25వేలు కమిషన్ దక్కడం విశేషం.

ఔషధాల తయారీలో వినియోగం..

ఈ చేప పొట్టలోని తిత్తులు ఔషధాల తయారీకి ఉపయోగపడతాయి. మందుల తయారీలో కచిడి చేప పిత్తాశయం, ఊపిరితిత్తులనూ వినియోగిస్తారు. శస్త్రచికిత్స అనంతరం వేసే కుట్లుకు వేసే దారం సైతం చేప గ్లార్ బ్లాడర్‌‌తో తయారు చేస్తారు. కచిడి చేప శాస్త్రీయ నామం ప్రొటోనిబియా డయాకాన్తస్. కచిడి చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్‌గా పిలుస్తుంటారు. ఖరీదైన వైన్‌ తయారీ పరిశ్రమల్లో ఈ చేప రెక్కలు వైన్‌ను క్లీన్ చేయడానికి వినియోగిస్తారు. ఇలా వేలంలో కొన్న ఈ చేపలను పొరుగు రాష్ట్రాలైన చెన్నై, కోల్‌కత్తా సముద్రతీరాలకు తరలిస్తారు. అక్కడ వీటిని ఐస్ బాక్సుల్లో ప్యాక్ చేసి యూరప్, సింగపూర్, హాంకాంగ్, మలేషియా, జపాన్, చైనా వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు. అనంతరం వీటిని మందుల తయారీకి ఉపయోగిస్తారు.

రెండేళ్ల కిందట రూ.లక్ష పలికిన ధర..

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోలో రెండేళ్ల కిందట మత్స్యకారుల వలకు కచిడి చేపలు దొరికాయి. అరుదుగా దొరికే ఈ చేపలకు చాలా గిరాకీ ఉంటుంది. పల్లెపాలెం హార్బర్‌లో అమ్మకానికి పెట్టిన మగ, ఆడ కచిడి చేపలను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. మగ చేప 16 కిలోల బరువు ఉంటే, ఆడచేప 15 కిలోలు ఉంది. మగ చేప లక్ష రూపాయలు, ఆడచేప రూ.30 వేల ధర పలికింది. ఈ చేపల్లో ఉండే ఔషధ గుణాల వల్లే ఎక్కువ గిరాకీ ఉంటుందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. అరుదుగా మాత్రమే జాలర్ల వలలో ఇవి దొరుకుతాయని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు