Bhaskar : మాజీ డీజీపీ మహేందర్ కు షాక్.. హైకోర్టు న్యాయవాది అవినీతి ఆరోపణలు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా కూడపెట్టుకున్నారంటూ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. By srinivas 06 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Mahender Reddy : మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి(Mahender Reddy) అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా కూడపెట్టుకున్నారంటూ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. ఖరీదైన భూములు.. ఈ మేరకు ఐపీఎస్ అధికారిగా(IPS Officer) వివిధ హోదాల్లో విధులు నిర్వహించిన సమయంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని మహేందర్ రెడ్డి లక్ష కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా కూడపెట్టుకున్నారన్నారు. హైదరాబాద్ నగరం, నగర శివార్లు, శివారు జిల్లాల్లోని అత్యంత ఖరీదైన భూములను తన పేరు మీద, కుటుంబ సభ్యులు, బినామీల పేర్ల మీద అక్రమంగా సంపాదించాడని ఆయన వివరించారు. ఏసీబీ, డీజీపీలకు ఫిర్యాదు.. అయితే ఇవి కేవలం ఆరోపణలు కాదని, ఆర్టీఐ(RTI) ద్వారా వివరాలు సేకరించి సాక్షాలతో సహా వెల్లడిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మహేందర్ రెడ్డి పై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఏసీబీ, డీజీపీలకు ఫిర్యాదు చేశామని తెలిపారు. మంగళవారం సైదాబాద్ డివిజన్ కళ్యాణ్ నగర్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సినీ నటి హీరోయిని దివంగత సౌందర్య చెందిన వట్టి నాగులపల్లి లోని స్థలాన్ని ఆమె సోదరుడిని బెదిరించి తన పేరు పైకి బదలాయించుకున్నాడని తెలిపారు. ఇది కూడా చదవండి: Fighter: ఎయిర్‌ఫోర్స్ యూనిఫామ్‌లో ముద్దులు.. హృతిక్-దీపికల సినిమాకు లీగల్ నోటీసులు కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి.. అలాగే గ్యాంగ్ స్టర్ నయిమ్(Gangster Nayeem), మరి కొంత మంది రౌడిసీటర్లను ముందుంచి భూములు కాజేసారన్నారు. ఇదంతా క్విడ్ ప్రో కో విధానంలో సాగిందని చెప్పారు. మరికొన్ని సందర్భాల్లో తన కిందిస్థాయి అధికారులను ఉపయోగించుకొని భూములు ఆర్జించాడని వివరించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తో కలిసి కూడా ఆయన పలు భూ వ్యవహారాలు చేశారన్నారు. ఆయన శైలి నచ్చక అప్పటి సీఎం రోశయ్య(CM Rosaiah) దూరం పెట్టారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) మహేందర్ రెడ్డి భూముల వ్యవహారంలో సమగ్ర విచారణ చేయించాలని ఆయన కోరారు. #allegations-of-corruption #rapolu-bhaskar #mahender-reddy #rti మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి