Ramoji rao: బతికుండగానే స్మారక కట్టడం.. చరిత్రలో నిలిచిపోయేలా రామోజీరావు అంతిమయాత్ర! రామోజీరావు అంతిమ యాత్ర చరిత్రలో నిలిచిపోయేలా సాగింది. ఏపీ ముఖ్యమంత్రి, ప్రముఖులు ఆయన పాడె మోసి నివాళులు అర్పించారు. గిన్నీస్ రికార్డులకెక్కిన ఆయన నిర్మించుకున్న సామ్రాజ్యం 4 కిలోమీటర్లమేర 'జోహార్ రామోజీరావు' నినాదాలతో మారుమోగింది. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 09 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Ramoji rao: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంతిమ యాత్ర చరిత్రలో నిలిచిపోయేలా సాగింది. అక్షర యోధుడిని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు కదలివచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఆయన చివరి చూపుకు హాజరై నివాళులు అర్పించారు. కాబోయే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రామోజీ పాడె మోసి తనతో ఉన్న బంధాన్ని చాటుకున్నారు. అంతేకాదు రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు ఉండే ఇంటి నుంచి ఆయన బతికుండానే నిర్మించుకున్న స్మారక కట్టడం వరకూ దాదాపు 4 కిలో మీటర్లు అంతిమాయాత్ర కొనసాగింది. ఆయన కడసారి చూపు కోసం అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. గంధపు చెక్కల చితిలో.. రామోజీ ఫిల్మ్‌సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే అంతిమ సంస్కారాలు ఈ రోజు ఉదయం 9 గంటలకు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తిచేశారు. గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు రామోజీ రావు చితిలోనూ లక్షల విలువైన గంధపు చెక్కలు పేర్చినట్లు సమాచారం. కాగా రామోజీరావు చితికి కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్ నిప్పంటించారు. జోహార్ రామోజీరావు.. ఇక రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది, అభిమానుల 'జోహార్ రామోజీరావు' నినాదాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. రామోజీరావు స్వగ్రామం పెదపారుపూడి నుంచి చివరి చూపు చూసేందుకు అనేక మంది వచ్చారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సినీదర్శకుడు రాఘవేంద్రరావు బోరున విలపించారు. రామోజీ ఫిల్మ్‌సిటీ ఉద్యోగులు, ఆయన సొంత గ్రామం ప్రజలు ఆయన మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. నిరంతరం ప్రజల కోసం పాటుపడే వ్యక్తిగా ఆయనను గుర్తు చేసుకున్నారు. అన్నింటా తనకు వెన్నుదన్నుగా నిలిచిన రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఇక రామోజీరావు మృతికి సంతాపంగా ఆదివారం సాయంత్రం టీవీ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ప్రసాద్ ల్యాబ్స్‌లో సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు సంతాపసభ జరగనుంది. గిన్నిస్ బుక్ రికార్డుల్లో నమోదు.. హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం కావడం తెలుగు వారికి ఎంతో ప్రాచుర్యాన్ని, గుర్తింపును తెచ్చింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా నిర్మాణ కేంద్రంగా గిన్నిస్ బుక్ రికార్డుల్లో నమోదైంది. దేశంలోని అన్ని భాషల సినిమాలూ ఇందులో నిర్మితమవుతున్నాయి. రామోజీరావు.. ఉర్దూ నుంచి కన్నడం వరకు, గుజరాతీ నుంచి బంగ్లా వరకు ఎన్నో ప్రాంతీయ భాషల్లో టెలివిజన్ ఛానళ్లను తెలుగునేలపై ఆవిష్కరించడం భాగ్యనగరానికీ ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టిందని ప్రముఖులు కొనియాడారు. #ramoji-rao #ramoji-film-city #last-trip మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి