Rameshwaram Cafe Blast: రామేశ్వరం పేలుడు కేసులో షరీఫ్ అరెస్ట్

బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ఒకరిని అరెస్ట్ చేసింది NIA. నిందితుడి షరీఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 18 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన NIA అధికారులు.. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. రామేశ్వరం కేఫ్ పేలుడు వెనకాల భారీ కుట్ర ఉందని అన్నారు.

New Update
Rameshwaram Cafe Blast: రామేశ్వరం పేలుడు కేసులో షరీఫ్ అరెస్ట్

NIA Arrests Key Conspirator Muzammil Shareef: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ఒకరిని అరెస్ట్ చేసింది NIA. నిందితుడి ముజమ్మిల్ షరీఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని 12 ప్రాంతాల్లో, తమిళనాడులోని 5 ప్రాంతాల్లో, ఉత్తరప్రదేశ్ లోని ఒక ప్రాంతంలో.. మొత్తం 18 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన NIA అధికారులు.. ఈ పేలుడులో ఉన్న కీలక సూత్రధారులను గుర్తించి అరెస్ట్ చేశారు.

ఈ కేసులో కీలక సూత్రధారులైన ముస్సావిర్ షజీబ్ హుస్సేన్, అబ్దుల్ మతీన్ తాహా పరారీలో ఉన్నారు. వీరిని గాలించే పనిలో పడ్డారు NIA అధికారులు. అయితే, ప్రస్తుతం పట్టుబడ్డ ముజమ్మిల్ షరీఫ్ ఈ పేలుడు జరపడం కోసం పేలుడు పదార్థాలు సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు.

రామేశ్వరం కేఫ్ పేలుడు (Rameshwaram Cafe Blast) కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు NIA అధికారులు. తనిఖీల్లో నిందితుల ఇళ్లల్లో కిలక ఆధారాలను NIA కనుక్కున్నట్లు తెలుస్తోంది. భారీ నగదు, ఎలెక్ట్రానిక్ పరికరాలను అధికారులు గుర్తించారు. కాగా పరారీలో ఉన్నవారిని త్వరలోనే పట్టుకుంటామని NIA వెల్లడించింది.

Also Read: ఎంపీగా పోటీ చేయబోతున్న స్టార్ హీరో.. ఏ నియోజకవర్గమో తెలిస్తే షాక్ అవుతారు!

Advertisment
Advertisment
తాజా కథనాలు