గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ గా..చరణ్! రామ్ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరో గుర్తింపు దక్కింది. అమెరికాలోని ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్ లో చరణ్‌కు గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ గా అవార్డు వచ్చింది. By Bhavana 09 Dec 2023 in సినిమా ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి మెగా స్టార్ చిరంజీవి వారుసునిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తనదైన నటనతో ముందుకు దూసుకుపోతున్నాడు రామ్ చరణ్. ఆర్ఆర్‌ఆర్ సినిమాతో అంతర్జాతీయంగానూ పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా నాటునాటు పాటకి ఆస్కార్ అవార్డు రావడంతో అటు తారక్ పేరుతో పాటు..ఇటు చరణ్ పేరు కూడా ప్రపంచ వ్యాప్తంగా మారు మోగిపోయింది. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ , స్టీవెన్ స్పీల్ బర్గ్ సైతం వీరి నటనను మెచ్చుకున్నారు. ఇప్పటికే వీరిద్దరికీ ఎన్నో అవార్డులు వీరిని వరించాయి. ఈ క్రమంలోనే తాజాగా చరణ్ ఖాతాలోకి మరో అంతర్జాతీయ అవార్డ్ వచ్చి చేరింది. అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్ లో చరణ్ కి బాలీవుడ్ నుంచి బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందింది. ఈ అవార్డ్స్ నామినేషన్స్ లో చరణ్ తో పాటు షారూఖ్ ఖాన్, ఆదా శర్మ, దీపికా పదుకొనే, రాశి ఖన్నా వంటి వారు చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో పాప్ గోల్డెన్ అవార్డ్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని కమిటీ అధికారికంగా వెల్లడించింది. టాలీవుడ్ నుంచి చరణ్‌కు పాప్ గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు దక్కింది. దీంతో చరణ్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం ఇచ్చిన నేషనల్ అవార్డ్స్ లో చరణ్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ వస్తుందని మెగా ఫ్యాన్స్ అనుకున్నారు కానీ..వీరికి కాకుండా అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది. అయితే ఇప్పుడు చరణ్ కి ఇంటర్నేషనల్ అవార్డ్ రావడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. An international Award 😁 to the Global Star Ram Charan.#RamCharan𓃵 won Golden Bollywood Actor Award.@AlwaysRamCharan #GameChanger pic.twitter.com/qp3XV7VEum— Xavier club Game Changer ™ 🚁 (@s_siechojithu) December 9, 2023 Also read: లాయర్ టు ఐటీ మినిస్టర్.. క్రికెట్ ప్లేయర్.. శ్రీధర్‌బాబు ఆల్‌రౌండర్ బాసూ! #ram-charan #international-award #pop-golden-award మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి