Ayodhya: అన్ని జైళ్లలో రామమందిర ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం!

యూపీ ప్రభుత్వం రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను చేసింది. జనవరి 22న జరగబోయే రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని జైళ్లశాఖ మంత్రి ధర్మవీర్‌ ప్రజాపతి తెలియజేశారు.

New Update
Ayodhya: అన్ని జైళ్లలో రామమందిర ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం!

Ayodhya Ram Mandir: దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం మరి కొద్ది రోజుల్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశంలోని పలువురు ప్రముఖులు కూడాఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి ఎందరో సాధువులు కూడా వస్తున్నారని సమాచారం.

ఇప్పటికే యూపీ ప్రభుత్వం రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను చేసింది. ఇదిలా ఉంటే జనవరి 22న జరగబోయే రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని యూపీలోని అన్ని జైళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని యూపీ జైళ్లశాఖ మంత్రి ధర్మవీర్‌ ప్రజాపతి శనివారం తెలియజేశారు.

ఖైదీలకు కూడా ఆ అద్భుత అవకాశం..

ఈ కార్యక్రమాన్ని ఖైదీలు అందరూ కూడా వీక్షిస్తారని అన్నారు. యూపీ లో ఉన్న అన్ని జైళ్లలో కలిపి 1.05 ఖైదీలు ఉన్నారని వారంతా కూడా భారతీయులే కావడంతో వారికి ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ధర్మవీర్‌ తెలిపారు. ఖైదీలుగా ఉన్నవారంతా కూడా పరిస్థితుల ప్రభావంతో నేరస్తులుగా మారారని ఆయన అన్నారు.

సామాజిక సేవలో..

ఎంతో పవిత్రమైన ఈ రామ మందిర ప్రారంభోత్సవానికి ఎవరినీ దూరం చేయకూడదు అనే ఉద్దేశంతోనే జైళ్లలో ఈ ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకోని బీజేపీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా సామాజిక సేవలో పాల్గొనాలని పార్టీ వర్గాలు తెలిపాయి.

Also read: అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన సమయంలోనే పిల్లల్ని కంటాం!

Advertisment
Advertisment
తాజా కథనాలు