Ram Charan: ఎయిర్ పోర్ట్ లో కూతురు 'క్లింకార' తో రామ్ చరణ్.. ఫొటోలు ఇవే! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యామిలీతో కలిసి ఇటలీ ట్రిప్ బయల్దేరాడు.. ఎయిర్ పోర్ట్ లో రామ్ చరణ్ ఉపాసన, క్లింకారతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. By Archana 18 Oct 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Ram Charan: రాంచరణ్ ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్ బయల్దేరారు. షూటింగ్స్ లో బిజీ బిజీగా ఉన్నప్పటికీ బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో ఇటలీ ట్రిప్ వెళ్తున్నాడు మన మెగా పవర్ స్టార్ రాం చరణ్. ఈ ఫారెన్ ట్రిప్ లో స్పెషల్ ఏంటంటే.. రాంచరణ్ తన కూతురు క్లింకారతో వెళుతున్న మొదటి ట్రిప్ ఇది. ఎయిర్ పోర్ట్ లో రామ్ చరణ్ ఉపాసన, క్లింకార, తన పెట్ డాగ్ రైమ్ తో కలిసి వెళ్తున్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామ్ చరణ్ చేతిలో తన పెట్ డాగ్ రైమ్, ఉపాసన చేతిలో తన కూతురు క్లింకార ఉన్నారు. ఉపాసన కూతురు మొహం కెమెరాలకు కనిపించకుండా ఉంచింది. క్లింకార పుట్టినప్పటి నుంచి కూతురు మొహం ఎక్కడా రివీల్ చేయలేదు. ఉపాసన తమ కూతురు పేరు విషయంలో కూడా చాలా కొత్తగా అలోచించి పెట్టారు. అంతే కాదు క్లింకార కోసం ఉపాసన స్పెషల్ గా ఒక ప్లే ఏరియా కూడా డిజైన్ చేయించారు దానికి సంబందించిన ఫోటో కూడా తన సోషల్ మీడియా వేదిక పై షేర్ చేశారు. క్లింకార బారసాలను కేవలం ఇంటి సభ్యుల సమక్షంలోనే జరిపించారు అలాగే బారసాల సమయంలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, ఉపాసన తల్లిదండ్రులు కలిసి ఉన్న ఫోటోలను రామ్ చరణ్, ఉపాసన తమ సోషల్ మీడియా వేదికపై షేర్ చేసుకున్నారు. బారసాల టైంలో కూడా మెగా ప్రిన్సెస్ క్లింకార మొహం రివీల్ చేయలేదు. ఈ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూ లో సాయి ధరమ్ తేజ్ ను.. రాంచరణ్ గారి పాపా ఎవరి పోలిక అని అడగగా దానికి తేజ్ పాప చరణ్ లానే ఉంది అంటూ సమాధానమిచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ పాపను చూడటానికి చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. Also Read: Prabhas: ప్రభాస్ ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ మిస్సింగ్.. హ్యాక్ అయ్యిందా..? డియాక్టివేట్ చేశారా..? Also Read:ఆ స్టార్ ఇంట్లో వరుణ్, లావణ్య ప్రీవెడ్డింగ్ పార్టీ..సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!! #ram-charan #ram-charan-with-upasana #ram-charan-at-airport మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి