Rakul Preeth Singh: భర్తతో కలిసి స్టెప్పులేసిన రకుల్.. వైరలవుతున్న వీడియో

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె భర్త జాకీ భగ్నానీతో చేసిన రీల్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బడే మియాన్ చోటే మియాన్ మూవీలోని 'మస్త్ మలంగ్ ఝుమ్' పాటకు ఇద్దరూ కలిసి స్టెప్పులేశారు.

New Update
Rakul Preeth Singh: భర్తతో కలిసి స్టెప్పులేసిన రకుల్.. వైరలవుతున్న వీడియో

Rakul Preeth Singh: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటిస్తూ సూపర్ క్రేజ్ దక్కించుకుంది రకుల్. ఇటు బాలీవుడ్, టాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ఈ బ్యూటీ.. ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో ఈమె జరిగింది. మూడేళ్ళుగా ప్రేమించుకున్న ఈ లవ్ బర్డ్స్ ఫిబ్రవరి 21 మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక పెళ్ళైన దగ్గర నుంచి... మ్యారేజ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సందడి చేస్తోంది రకుల్. తాజాగా తన భర్త జాకీ భగ్నానీతో చేసిన రీల్ ఒకటి షేర్ చేసింది. పెళ్ళైన తర్వాత మొదటి సారి తన భర్తతో కలిసి చేసిన ఈ డాన్స్ వీడియో సొషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: This Week OTT Release: ఈ వారం ఓటీటీలో సూపర్ హిట్ చిత్రాలు.. అందరూ వెయిట్ చేస్తున్న ఆ సినిమా కూడా

publive-image

రకుల్ కు ఛాలెంజ్ విసిరిన టైగర్ ష్రాఫ్

అయితే రకుల్ ఈ రీల్ ఒక ఛాలెంజ్ లో భాగంగా చేసింది. బాలీవుడ్ స్టార్స్ అక్షయ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "బడే మియాన్ చోటే మియాన్". ఇటీవలే ఈ సినిమాలోని 'మస్త్ మలంగ్ ఝుమ్' రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సాంగ్ పై రీల్ క్రియేట్ చేసిన నటుడు టైగర్ ష్రాఫ్.. దాన్ని రీక్రియేట్ చేయాలంటూ రకుల్ కు ఛాలెంజ్ విసిరారు .

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

ఛాలెంజ్ లో భాగంగా రకుల్, తన భర్త జాకీ భగ్నానీతో కలిసి ఆ పాటకు స్టెప్పులేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మరో నలుగురు సెలెబ్రిటీలను నామినేట్ చేసింది రకుల్. నెక్స్ట్ అర్జున్ కపూర్, ఆయుష్మాన్, భూమిపెడ్నేకర్ ఈ రీల్ ను రీక్రియేట్ చేయాలంటూ పోస్ట్ పెట్టింది . రకుల్, జాకీ డాన్స్ వీడియో చూసిన నెటిజన్లు సూపర్, క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: Ambani Wedding: సచిన్, ధోనీ, షారుఖ్, చెర్రి అందరూ ఒకే చోట.. అంబానీ ప్రీవెడ్డింగ్ లో తళుక్కుమన్న సెలబ్రెటీలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు