Rajnath singh: ఆయనొక్కడే తోపా..! కేసీఆర్‌పై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫైర్‌

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఒక్కరే ఉద్యమించలేదని, ఆయనొక్కడే హీరో కాదని యావత్ తెలంగాణ సమాజం, బీజేపీ కూడా పోరాటం చేసిందని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. రాణి రుద్రమదేవి, కుమురం భీమ్ వంటి ఎంతోమంది వీరులను కన్న గడ్డ తెలంగాణ అన్నారు. కేసీఆర్‌ కుటుంబం.. ఆయన పరివారం మాత్రమే రాష్ట్రంలో బాగుపడ్డారని, ప్రజలు బాగుపడలేదని తెలిపారు.

New Update
Rajnath singh: ఆయనొక్కడే తోపా..! కేసీఆర్‌పై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫైర్‌

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఒక్కరే ఉద్యమించలేదని, ఆయనొక్కడే హీరో కాదని యావత్ తెలంగాణ సమాజం, బీజేపీ కూడా పోరాటం చేసిందని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. సోమవారం జమ్మికుంటలో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాణి రుద్రమదేవి, కుమురం భీమ్ వంటి ఎంతోమంది వీరులను కన్న గడ్డ తెలంగాణ అన్నారు. 1984లో బీజేపీ రెండు ఎంపీ స్థానాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని, ఆ సమయంలో గెలిచిన రెండింటిలో ఒకటి తెలంగాణ నుంచి జంగారెడ్డి గెలిచారన్నారు. 27 ఏళ్లుగా గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉందని, అభివృద్ధికి రోల్‌ మోడల్‌గా గుజరాత్‌ నిలిచిందని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. పదేళ్లుగా తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు.

కేసీఆర్‌ పాలనలో అవినీతి పెరిగిందని, ఆయనకు కుటుంబమే తొలి ప్రాధాన్యత అని రాజ్‌నాథ్‌ తెలిపారు. కేసీఆర్‌ కుటుంబం.. ఆయన పరివారం మాత్రమే రాష్ట్రంలో బాగుపడ్డారని, ప్రజలు బాగుపడలేదని తెలిపారు. తెలంగాణ నెంబర్‌ 1గా ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారని రాజ్‌నాథ్‌ తెలిపారు. బీజేపీఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ అభినందించారు. హుజురాబాద్‌ ఉపఎన్నికలో కేసీఆర్‌ స్వయంగా ప్రచారం చేపట్టినా.. విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టినా ఉపఎన్నికలో రాజేందర్‌ను ఓడించలేకపోయారని అన్నారు. యువతకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని, ఉద్యోగాలు కల్పిస్తామన్న కేసీఆర్‌ హామీ ఏమైందని ప్రశ్నించారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని కేసీఆర్‌ ప్రభుత్వం యువతకు సమాధానం చెప్పాలన్నారు. కేవలం భారాస అనుచరగణానికే దళిత బంధు అందిందని మండిపడ్డారు. రామజన్మభూమి కోసం బీజేపీ ఉద్యమించిందని, జనవరి 26న అయోధ్యలో భవ్య రామమందిర కల సాకారం చేయబోతున్నామని తెలిపారు. 370 అధికరణాన్ని తొలగించి జమ్ముకశ్మీర్‌లో స్వేచ్ఛాయుత వాతావరణం తీసుకొచ్చామని, బీజేపీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతుందని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు.

కేసీఆర్ ఓటమే నా లక్యం: ఈటల
ప్రస్తుతం ఏ పథకం కావాలన్నా బీఆర్‌ఎస్‌లోకి రమ్మంటున్నారని ఈటల రాజేందర్‌ విమర్శించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని నన్ను కమలాపురం ఓటర్లు 25 వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారని, హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. హైదరాబాద్‌లో మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేస్తే కేసీఆర్‌కు నచ్చలేదని, సమ్మె చేసిన 1,700 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని మండిపడ్డారు. ఉద్యమాల గడ్డగా పేరున్న ఇందిరా పార్కులో ధర్నాలు నిషేధించారని, వీఆర్‌ఏలకు నేను మద్దతివ్వడం కేసీఆర్‌కు నచ్చలేదన్నారు. హుజూరాబాద్‌లో నన్ను ఓడించేందుకు కేసీఆర్‌ అనేక కుట్రలు చేశారని, ప్రజల గుండెల్లో స్థానం ఉన్న వ్యక్తిని ఎవరైనా ఓడించగలరా? అని ప్రశ్నించారు. ఈసారి బీజేపీని ప్రజలు ఆశీర్వదించాలని ఈటల కోరారు. సభకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీ చేస్తానని ఆషామాషీగా చెప్పలేదని.. కచ్చితంగా పోటీచేసి తీరుతానని ఈటల అన్నారు. సీఎం కేసీఆర్‌ను ఓడించడమే తన లక్ష్యమన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు