Rajeev Kanakala: చంద్రబాబు అరెస్ట్ పై అందుకే ఎన్టీఆర్‌ స్పందించలేదు..!!

తారక్ సినిమాలతో బిజీగా ఉండడం వల్లే చంద్రబాబు అరెస్ట్ పై స్పందించలేదనుకుంటా అంటూ నటుడు రాజీవ్ కనకాల వ్యాఖ్యనించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఒక్క కామెంట్ కూడా చేయలేదు. కనీసం సోషల్ మీడియాలోనూ స్పందించని పరిస్ధితి కనిపిస్తోంది. అయితే, ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదంటూ వార్తలు హాల్ చల్ అవుతున్నా..ఎన్టీఆర్ మాత్రం రియాక్ట్ అవ్వడం లేదు.

New Update
Rajeev Kanakala: చంద్రబాబు అరెస్ట్ పై అందుకే ఎన్టీఆర్‌ స్పందించలేదు..!!

Rajeev Kanakala: తారక్ సినిమాలతో బిజీగా ఉండడం వల్లే చంద్రబాబు అరెస్ట్ పై స్పందించలేదనుకుంటా అంటూ నటుడు రాజీవ్ కనకాల వ్యాఖ్యనించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఒక్క కామెంట్ కూడా చేయలేదు. కనీసం సోషల్ మీడియాలోనూ స్పందించని పరిస్ధితి కనిపిస్తోంది. ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదంటూ వార్తలు హాల్ చల్ అవుతున్నా..ఎన్టీఆర్ మాత్రంనిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ కావడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై తీవ్ర చర్చనీయాంశం అయింది. దీనిపై ఎన్టీఆర్ స్నేహితుడు రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎన్టీఆర్ వైఖరి ఏమిటి అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, బహుశా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడం వల్లే తారక్ ఈ విషయంలో స్పందించకపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు చాలా సమయం కేటాయించిన తారక్.. ఆ సమయంలో దాదాపు మూడు, నాలుగు సినిమాలు చేసి ఉండేవాడని అన్నారు. అయితే, తారక్ ప్రస్తుతం దేవరతో బిజీగా ఉన్నాడని.. ఆ సినిమా కూడా రెండు భాగాలుగా వస్తోందంటున్నారని.. దాంతో తారక్ తన దృష్టంతా సినిమాలపై ఫోకస్ పెట్టాడని వ్యాఖ్యనించారు.  అందుకే రాజకీయాలపై స్పందించలేదని భావిస్తున్నానంటూ రాజీవ్ విరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు