Rajinikanth: తాను పని చేసిన బస్సు డిపోకు వెళ్లిన తలైవా.... రజనీ సింప్లిసిటీని చూసి అభిమానులు ఫిదా...! ఎంత ఎదిగినా అంత ఒదిగి వుండే వ్యక్తి సూపర్ స్టార్ రజనీ కాంత్. ఆసియాలోనే టాప్ హీరోల్లో ఒకరిగా వున్నా అత్యంత సాధారణ వ్యక్తిలా ఉండటం ఆయనకు మాత్రమే సాధ్యం. మనం ఏ స్థాయిలో వున్నా మన మూలాలను మరచి పోకూడదని నమ్మే వ్యక్తి ఆయన. అందుకే ఆయన సూపర్ స్టార్ స్థాయిలో వున్న తన పాత రోజులను మరచి పోలేదు. అందుకే కర్ణాకటలో తాను కండక్టర్ గా పని చేసిన బస్సు డిపోకు వెళ్లారు. By G Ramu 29 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి Rajinikanth Surprise Visit to Bus Depot: ఎంత ఎదిగినా అంత ఒదిగి వుండే వ్యక్తి సూపర్ స్టార్ రజనీ కాంత్. ఆసియాలోనే టాప్ హీరోల్లో ఒకరిగా వున్నా అత్యంత సాధారణ వ్యక్తిలా ఉండటం ఆయనకు మాత్రమే సాధ్యం. మనం ఏ స్థాయిలో వున్నా మన మూలాలను మరచి పోకూడదని నమ్మే వ్యక్తి ఆయన. అందుకే ఆయన సూపర్ స్టార్ స్థాయిలో వున్న తన పాత రోజులను మరచి పోలేదు. అందుకే కర్ణాకటలో తాను కండక్టర్ గా పని చేసిన బస్సు డిపోకు వెళ్లారు. బెంగళూరు మెట్రో పాలిటన్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (BMTC)కి ఆయన ఓ సాధారణ వ్యక్తిలా వెళ్లాడు. దీంతో అక్కడ వున్న వాళ్లంతా రజనీకాంత్ ను చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ డ్రైవర్లు, కండక్టర్లతో ఆయన కాసేపు ముచ్చటించారు. దీంతో సిబ్బంది అంతా ఆనందంలో మునిగి పోయారు. ఆయనతో కలిసి సెల్ఫీలు దిగి మురిసి పోయారు. కాసేపటికే ఈ వార్త వైరల్ అయింది. ఈ క్రమంలో ఆయన్ని చూసేందుకు అభిమానులు డిపోకు వెళ్లారు. రజనీకాంత్ అత్యున్నత స్థితిలో వున్నప్పటికీ తాను గతంలో పని చేసిన డిపోను గుర్తు పెట్టుకుని రావడం చాలా గొప్ప విషయం అని సిబ్బంది అంటున్నారు. బస్ డిపోను రజనీకాంత్ సందర్శించిన సందర్బంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన సింప్లిసిటీకి అందరూ ఆశ్చర్య పోతున్నారు. రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్ (Shivaji Rao Gaikwad). సినిమాల్లోకి రాక మందు ఆయన బస్సు కండక్టర్ గా పని చేశారు. ఆ తర్వాత ఆయన సినిమా రంగంలోకి వచ్చాక ప్రముఖ లెజెండరీ డైరెక్టర్ బాలచందర్ ఆయనకు రజనీకాంత్ (Rajinikanth)గా పేరు పెట్టారు. అపూర్వ రాగంగల్ సినిమాతో రజనీకాంత్ కు మంచి బ్రేక్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి రజనీకాంత్ వెనక్కి తిరిగి చూడలేదు. Also Read: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న దళపతి విజయ్ వారసుడు జాసన్ సంజయ్ #rajinikanth #super-star #bus-depot #rajani-kanth #conductor #shivaji-rao-gaikwad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి