Sharukh Khan : ఆ స్టార్ హీరో తన బయోపిక్‌లో నటించాలి.. క్రికెటర్ జోస్ బట్లర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

క్రికెటర్ జోస్ బట్లర్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ తన బయోపిక్‌లో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. కొన్ని రోజుల క్రితం షారుఖ్ జోస్ బట్లర్‌ను హగ్ చేసుకున్న వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరలైంది. ఆటలో జోస్ మంచి ప్రదర్శనకు షారుఖ్ అభినందనలు కూడా తెలిపారు.

New Update
Sharukh Khan : ఆ స్టార్ హీరో తన బయోపిక్‌లో నటించాలి.. క్రికెటర్ జోస్ బట్లర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Cricketer : చిత్ర పరిశ్రమ(Cine Industry) లో అత్యంత ఇష్టమైన నటుల్లో షారుక్ ఖాన్(Sharukh Khan) ఒకరు. ఆయన్ను భారతదేశం(India) లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానిస్తారు. షారుఖ్ ఖాన్ నటించిన పలు చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించాయి. దేశ విదేశాల్లో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు షారుఖ్. సాధారణ ప్రజలే కాదు, చాలా మంది అంతర్జాతీయ స్టార్లు కూడా షారుక్ ఖాన్‌ కు ఫ్యాన్స్ అని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు.

క్రికెటర్ జోస్ బట్లర్ రాజస్థాన్ రాయల్స్‌

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఇంగ్లీష్ క్రికెటర్ జోస్ బట్లర్(Jos Buttler) షారుక్ ఖాన్ తన బయోపిక్‌లో నటించాలని కోరుకుంటున్నట్లు తన కోరికను వ్యక్తం చేశారు. జోస్ బట్లర్ IPL 2024లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో భాగమని అందరికీ తెలుసు.

Jos Buttler - Sharukh Khan

జోస్ బయోపిక్ లో షారుఖ్

జోస్ తన బయోపిక్‌(Biopic) లో షారుఖ్ ని చూడాలనుకుంటున్నాడు. ఫ్రాంచైజీ కోసం నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో.. క్రికెటర్ ట్రెంట్ బౌల్ట్ అతని బయోపిక్‌లో నటించబోయే బాలీవుడ్ నటుడి పేరు చెప్పమని జోస్ ను అడిగాడు. జోస్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ పేరును చెప్పారు. ఈ సమాధానంపై ట్రెంట్ బోల్డ్ కూడా "అవును, మేము షారుక్‌ను ప్రేమిస్తున్నాము" అని చెప్పాడు.

జోస్ బట్లర్‌ను షారుఖ్ హగ్ 

కొన్ని రోజుల క్రితం షారుఖ్ జోస్ బట్లర్‌ను కౌగిలించుకున్న వీడియో నెట్టింట వైరలైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16న షారుక్ ఖాన్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ మధ్య IPL మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో షారుఖ్ ఖాన్ జట్టు పరాజయం పాలైంది. దీని తరువాత, షారుక్ తన జట్టును ప్రోత్సహించడానికి మైదానానికి చేరుకున్నాడు. అదే సమయంలో, అతను జోస్ బట్లర్‌ను కౌగిలించుకున్నాడు. ఆటలో అతని మంచి ప్రదర్శనకు అభినందనలు తెలిపాడు.

Also Read: Actress Amani: అవి చూపించమని అడిగారు.. కాస్టింగ్ కౌచ్ పై నటి ఆమని షాకింగ్ కామెంట్స్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు