Bhale Unnade Trailer : 'భలే ఉన్నాడే' ట్రైలర్ రిలీజ్.. సరికొత్త పాత్రలో ఆకట్టుకున్న రాజ్ తరుణ్

రాజ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'భలే ఉన్నాడే'. ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్. ట్రైలర్‌ చూస్తే సినిమా ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ అని అర్థమవుతుంది. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, శేఖర్ చంద్ర మ్యూజిక్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి.

New Update
Bhale Unnade Trailer : 'భలే ఉన్నాడే' ట్రైలర్ రిలీజ్.. సరికొత్త పాత్రలో ఆకట్టుకున్న రాజ్ తరుణ్

Bhale Unnade Trailer : రాజ్‌ తరుణ్‌ క్యూట్‌ యాక్టర్‌ అంటే అందరికీ తెలుసు. ఈయన నటించిన సినిమాలు చాలా వరకూ ఫ్యామిలీ ఆడియన్స్‌ని అలరించాయి. ఇప్పుడు ఈ హీరో తన కామెడీ టైమింగ్‌ని మరోసారి ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాడు. షార్ట్ గ్యాప్ లో తిరగబడరా సామి, పురుషోత్తముడు వంటి సినిమాలను రిలీజ్ చేసిన ఈ యంగ్ హీరో ఇప్పుడు 'భలే ఉన్నాడే' అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది.

శివసాయివర్ధన్‌ డైరెక్షన్ లో రవికిరణ్ ఆర్ట్స్, మారుతి టీమ్ బ్యానర్స్ పై N.V. కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మ‌నీషా కంద్కూర్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఇందులో రాజ్  టైలర్, బ్యూటీషియన్ గా సరి కొత్త పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్. ట్రైలర్‌ చూస్తే సినిమా ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ అని అర్థమవుతుంది.

Also Read : ఆ రాష్ట్రంలో కిరణ్ అబ్బవరం పెళ్లి.. ఎప్పుడంటే?

రాజ్‌ తరుణ్‌ పాత్ర పేరు రాధ. సారీ డ్రేపింగ్‌ చేసే జాబ్‌ చేస్తుంటాడు. ఈయన పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కానీ, ఈయన ప్రవర్తన వల్ల అమ్మాయిలు దూరమవుతూ ఉంటారు. ఇక సినిమాలో హీరోయిన్‌గా నటించిన మనీషా కందుర్కర్‌తో రాజ్‌ తరుణ్‌ కెమిస్ట్రీ బాగుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్‌ సినిమాకు ప్లస్‌ పాయింట్‌ అవుతుంది. ట్రైలర్‌ చూస్తే సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. సెప్టెంబర్ 7 వినాయక చవితి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు