RAIN ALERT: తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు! తెలంగాణలోని పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణతో రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు పడిపోతాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. By V.J Reddy 07 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నాలుగు రోజులపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడన ద్రోణి వలన తెలంగాణతో పాటు, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్నాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. Also Read: రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపుతాం.. షర్మిలకు సొంత నేతల షాక్! రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదలతో పాటు తెలంగాణవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే నాలుగు రోజులు హైదరాబాద్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, నారాయణ పేట, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లోనూ అక్కడక్కడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వాతావరణ శాఖ హెచ్చరికతో తెలంగాణ రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు పడుతుండడంతో పంట నష్టపోతామని తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఎక్కువగా వరి, పత్తి సాగు చేశారు. మరి ఈ అకాల వర్షాలు నుండి రైతులు బయటపడుతారా? లేదా? అనేది చూడాలి. Also Read: బాణసంచా నిషేధం అన్ని రాష్ట్రాలకు.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు #telangana #rain-alert #heavy-rains-in-telugu-states మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి