Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఆ జిల్లాలలో భారీ వర్షాలు! వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఏపీలో వచ్చే మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఇప్పటికే గత రాత్రి నుంచి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. By Bhavana 21 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి Rain Forecast to AP and Telangana: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఏపీలో వచ్చే మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ (Meteorological Department) పేర్కొంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఇప్పటికే గత రాత్రి నుంచి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు మూడురోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది. అల్లూరి సీతారారాజు, బాపట్ల, ఏలూరు, పార్వతీపురం మన్యం, గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇదిలా ఉంటే తీరం వెంబడి బలమైన గాలులు కూడా వీచే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు సముద్రంలోనికి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తాలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. మరోవైపు అల్పపీడనం ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుంది. వచ్చే మూడ్రోజులు తెలంగాణలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు , మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడవచ్చు. ముఖ్యంగా పెద్దపల్లి, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. Also Read: యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన తరువాత..ఇదే తొలిసారి! #rains #yellow-alert-in-ts #weather-updates #rains-in-telangana #telangana-weather-update #andhraparadesh #rains-in-ap #rain-forecast-to-ap-and-telangana #ap-weather-update #yellow-alert-in-ap మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి