Railway jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 7,951 ఉద్యోగాలకు నోటిఫికేషన్! రైల్వేశాఖ నుంచి 7,951 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 29వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వయో పరిమితి 18 -36 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. By srinivas 04 Aug 2024 in జాబ్స్ నేషనల్ New Update షేర్ చేయండి Railway jobs: రైల్వేశాఖ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. 7,951 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 29వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎడిట్ ఆప్షన్ కోసం సెప్టెంబర్ 8 వరకూ అవకాశం కల్పించింది. పోస్టుల వివరాలు: కెమికల్ సూపర్‌వైజర్, రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్, రీసెర్చ్ పోస్టులు, జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు 7,934 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయో పరిమితి: 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT). పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్: సీబీటీలో ప్రతి తప్పు సమాధానానికి కేటాయించిన మార్కులో 1/3 వంతున నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. మొదటి దశ సీబీటీకి హాజరైన అనంతరం బ్యాంకు ఛార్జీలు మినహాయించి రూ.400 తిరిగి చెల్లిస్తారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా యూపీఐ ద్వారా మాత్రమే ఆన్లైన్ ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. #railway-department-job-notification #7 #951-junior-engineer-posts మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి