యూపీలోని హత్రాస్ జిల్లాలో జరిగిన బోలే బాబా ఆధ్యాత్మిక ప్రసంగంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు.ఈ విషయాన్నికాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
యూపీలోని హత్రాస్ జిల్లాలో జరిగిన బోలే బాబా ఆధ్యాత్మిక ప్రసంగంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు.
యూపీలోని హధ్రాస్ జిల్లాలోని సికంద్రరావు ప్రాంతంలోని పుల్రాయి గ్రామంలోని బహిరంగ ప్రదేశంలో ఆధ్యాత్మిక నాయకుడు బోలే బాబా ప్రసంగం జరిగింది. తొక్కిసలాటలో 121 మంది చనిపోయారు. 20 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు సంతాపం తెలిపారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ.. హద్రాస్ ఘటన దురదృష్టకరం. రాహుల్ అక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ నగరంలో ఆయన బాధిత ప్రజలతో చర్చించనున్నారని తెలిపారు.
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్'తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమా టీజర్ విడుదలై ప్రమోషన్స్ షురూ అయ్యాయి. గత వివాదాల తర్వాత పెద్దగా కనిపించలేదు రాజ్, తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు.
Raj Tarun: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ గురించి చెప్పాలంటే, అతని స్టైల్ కొంచెం ప్రత్యేకమే. కేవలం సినిమా ప్రమోషనన్స్ టైమ్ లో మాత్రమే కనిపించి, తర్వాత పూర్తిగా మాయమవ్వడం అతని అలవాటుగా కనిపిస్తోంది. మూవీ రిలీజ్ టైమ్ లో తప్ప మిగతా రోజుల్లో ఏమాత్రం అప్‌డేట్స్ లేకుండా మాయమయిపోతుంటాడు.
అయితే ఇక్కడ విషయం ఏంటంటే, రాజ్ తరుణ్ లాగానే అతని సినిమాలు కూడా అంతే త్వరగా మాయమవుతాయి. ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాడో, టైటిల్ ఏంటి, ఎప్పుడు విడుదలవుతుందో ఇవేమి ఎవరికీ తేలేదు. సడన్ గా కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంటాడు.
‘పాంచ్ మినార్’ ప్రమోషన్స్..
అయితే ఈ సారి కూడా అదే జరిగింది, రాజ్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చాడు. ‘పాంచ్ మినార్’(Paanch Minar) అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. చిత్ర బృందం టీజర్‌ను లాంచ్ చేసింది. ఇకపై సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను వరుసగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విడుదల కూడా త్వరలోనే ఉండబోతుందట.
ఇదంతా పక్కనపెడితే, గతంలో రాజ్ తరుణ్ పై వచ్చిన వ్యక్తిగత వివాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. లావణ్య అనే మహిళ రాజ్ తరుణ్ తన భర్త అని మీడియా ముందుకొచ్చి సంచలనం సృష్టించింది. ఆ వివాదం పెద్ద చర్చకు దారితీసినా, చివరికి ఆమెనే మళ్లీ అతనికి క్షమాపణలు చెప్పింది. తన ఆరోపణలకు తానే క్లారిటీ ఇవ్వడంతో, రాజ్ తరుణ్ తిరిగి తెరపైకి వస్తాడని అందరూ భావించారు.
అయితే ఆ వివాదం సద్దుమణిగాక కూడా రాజ్ తరుణ్ మాత్రం మౌనం వీడలేదు, కావాలనే అజ్ఞాతం లోకి వెళ్ళాడో, లేదంటే ప్లాన్డ్ సైలెన్స్‌లో ఉన్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇప్పుడు మరోసారి సినిమా విడుదల దశకు చేరుకోవడంతో మీడియా ముందుకొచ్చిన రాజ్ తరుణ్, సినిమా ప్రమోషన్స్ ముగిసిన తర్వాత మళ్లీ మాయమవుతాడా? అన్నది ప్రెశ్నగా మారింది.