Rahul Gandhi: నీట్ పై చర్చ జరగాలి.. ప్రధాని మోదీకి రాహుల్‌ గాంధీ లేఖ

ప్రధాని మోదీకి రాహుల్‌ గాంధీ లేఖ రాశారు. నీట్‌పై పార్లమెంట్‌లో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. 24 లక్షల మంది నీట్‌ అభ్యర్థులకు ప్రధాని మోదీ జవాబు చెప్పాలని అన్నారు. నీట్‌పై చర్చను ప్రధాని మోదీనే నడిపించాలని అన్నారు.

New Update
Rahul Gandhi: నీట్ పై చర్చ జరగాలి.. ప్రధాని మోదీకి రాహుల్‌ గాంధీ లేఖ

Rahul Gandhi Letter TO Modi: ప్రధాని మోదీకి రాహుల్‌ గాంధీ లేఖ రాశారు. నీట్‌పై పార్లమెంట్‌లో (Parliament Sessions) చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. 24 లక్షల మంది నీట్‌ అభ్యర్థులకు ప్రధాని మోదీ జవాబు చెప్పాలని అన్నారు. నీట్‌పై చర్చను (Debate On NEET) ప్రధాని మోదీనే నడిపించాలని అన్నారు.

రాహుల్ పై మోదీ చురకలు..

రాహుల్‌ గాంధీ చిన్నపిల్లాడి మనస్తత్వం ఈ సభలో చాలాసార్లు బయటపడిందని అన్నారు మోదీ. పిల్లాడి తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. సానుభూతి పొందేందుకే పిల్లాడి డ్రామాలు. రాహుల్ కన్నుకొడతారు, ఆలింగనం చేసుకుంటారు. చిన్న పిల్లల చేష్టల నుంచి కాంగ్రెస్‌ సభ్యులు బయటకు రావాలి. ఈవీఎం, రాజ్యాంగ రిజర్వేషన్లపై కాంగ్రెస్ అబద్ధాలు చెప్పింది.

నీట్‌ పేపర్‌పై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. నిందితులను కఠినంగా శిక్షిస్తాం. యువత భవిష్యత్తుతో ఆడుకునేవారిని వదిలిపెట్టం. ఇలాంటి ఘటనలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని’ ప్రధాని మోదీ అన్నారు.

Also Read: చర్లపల్లి జైలు నుంచి విడుదల కానున్న 213 మంది ఖైదీలు

Advertisment
Advertisment
తాజా కథనాలు