Rahul Gandhi: రేపటి నుంచి రాహుల్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో న్యాయ్ యాత్ర రేపు ప్రారంభం కానుంది. రేపు మణిపూర్ నుంచి ఈ యాత్రను ప్రారంభించనున్నారు రాహుల్. మార్చి 20న ముంబైలో ఈ యాత్ర ముగియనుంది. మొత్తం 15 రాష్ట్రాల్లో యాత్ర చేయనున్నారు రాహుల్. By V.J Reddy 13 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Bharat Jodo Nyay Yatra: భారత్ జోడో యాత్రను విజయంతంగా పూర్తి చేసిన కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర చేసేందుకు సిద్ధమైయ్యారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra) పేరుతో మరో సారి పాదయాత్ర చేయనున్నారు. ఈ యాత్రను రేపు మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. భారత్ జోడో యాత్రకు (Jodo Yatra) కొనసాగింపుగా ఈ యాత్రను చేపట్టనున్నారు. రేపు ప్రారంభం కానున్న ఈ యాత్ర మార్చి 20 వరకు కొనసాగనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ న్యాయ యాత్ర జరగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ యాత్ర 15 రాష్ట్రాలు, 110 జిల్లాలు, 100 లోక్‌సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ మార్చి 20న ముంబైలో ముగియనుంది. ALSO READ: చంద్రబాబు ఇంటికి షర్మిల రాహుల్ యాత్రకు మణిపూర్ బ్రేక్.. రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర రేపు మణిపూర్ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడి మణిపూర్ బీజేపీ సర్కార్ షాక్ ఇచ్చింది. రాహుల్ చేపట్టే ఈ యాత్రకు అనుమతులు లేవని స్పష్టం చేసింది.మణిపూర్ అల్లర్లు, శాంతి భద్రతల దృష్ట్యా భారత న్యాయ యాత్రకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇంఫాల్ ఈస్ట్‌లోని చారిత్రక హప్తా కాంజీబంగ్ వేదికగా ప్రారంభోత్సవ వేడుక నిర్వహించేందుకు మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రారంభ వేదికకు అనుమతి కోసం వారం రోజుల క్రితం చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు MPCC అధ్యక్షుడు కేశం మేఘచంద్ర. స్వయంగా ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌ను కలిసి అనుమతి కోరారు. అయితే.. ఇంఫాల్ ప్యాలెస్ గ్రౌండ్‌లో వేదికకు అనుమతి ఇవ్వడం లేదని బీరెన్ సింగ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. యాత్ర ఆగదు.. కాంగ్రెస్ పార్టీ... మరోవైపు అనుమతి నిరాకరణపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు. షెడ్యూల్ ప్రకారమే రాహుల్ గాంధీ భారత జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఎవరెన్ని చేసిన ఈ యాత్ర ప్రారంభాన్ని ఆపలేరని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోడానికి రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారని ఆయన అన్నారు. ఈ యాత్రను ఆపేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఇదిలా ఉండగా రేపు రాహుల్ గాంధీ ప్రారంభించబోయే యాత్రాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ALSO READ: వైసీపీ నాలుగో లిస్ట్.. ఎప్పుడంటే? #bjp #manipur #bharat-nyay-yatra #rahul-gandhi-bjp-shock మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి