Rahul Gandhi: ఆ వార్త విని ఆవేదనకు గురయ్యాను: రాహుల్‌ గాంధీ

వయనాడ్‌ ఘటనపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. మెప్పాడి సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడటంతో తాను తీవ్ర ఆవేదనకు గురైనట్టు చెప్పారు. తమ వాళ్లను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై కేరళ సీఎంతో మాట్లాడానని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

New Update
Rahul Gandhi: అధికారంలోకి వస్తే తెలంగాణలో కుల గణన సర్వే చేపడతాం: రాహుల్ గాంధీ

Rahul Gandhi: వయనాడ్‌ ఘటనపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. మెప్పాడి సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడటంతో తాను తీవ్ర ఆవేదనకు గురైనట్టు చెప్పారు. తమ వాళ్లను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాట్లు చెప్పారు. ఇంకా చిక్కుకున్న వారిని త్వరలోనే సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తారని ఆశిస్తున్నానని అన్నారు. కేరళ సీఎం, వయనాడ్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడనినట్లు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ప్రధాని మోదీ స్పందన..

కొండచరియలు విరిగిపడిన ఘటనపై మోదీ స్పందించారు. వయనాడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసి ఆందోళనకు గురైనట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల చుట్టూ తన ఆలోచనలు తిరుగుతున్నాయని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్‌తో మాట్లాడి కేంద్రం నుంచి అవసరమైన అందిస్తామని చెప్పినట్లు తెలిపారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు