MP Rahul Gandhi: ప్రతి నెల మహిళల ఖాతాల్లో రూ.8,500.. రాహుల్ గాంధీ కీలక ప్రకటన బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయిదని అన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 'మహాలక్ష్మి' పథకం కింద ప్రతి నెల అర్హులైన మహిళల ఖాతాలో రూ.8,500 జమ చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో పేదరికం అనేది లేకుండా చేస్తామన్నారు. By V.J Reddy 13 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి MP Rahul Gandhi: లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిచి కేంద్రంలో అధికారం లోకి రావాలని వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో ప్రజల కనుసందాల నుంచి బీజేపీని దూరం చేసేందుకు ప్రత్యేక మేనిఫెస్టో ను రూపొందించింది. ఇదిలా ఉండగా పది ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యాలను ప్రజల ముందు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రచారాల్లో దూసుకుపోతుంది. ఈరోజు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పర్యటించారు కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ. బస్తర్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మహాసభలో పాల్గొన్నారు రాహుల్. అనంతరం బీజేపీ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు. ఆ 22 మందికోసమే మోడీ ఆరాటన.. రాహుల్ గాంధీ మాట్లాడుతూ... దేశంలోని 70 కోట్ల మంది ప్రజల వద్ద ఉన్న సంపద మొత్తం ఒక 22 మంది దగ్గరే ఉందని అన్నారు రాహుల్ గాంధీ. ప్రధాని మోడీ రోజంతా ఆ 22 మందికి సహాయం చేస్తారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం విస్తరిస్తోంది, ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని అన్నారు. దీని గురించి ప్రధాని మోడీ మాట్లాడటం మీరు ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు. దీనిపై మీడియా సంస్థలు ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు. మీడియా సంస్థలు మొత్తం ప్రధాని మోడీ కనుసందాల్లో పనిచేస్తున్నాయని.. మోడీ విమానంలో వెళ్లడం, సముద్రంలోకి వెళ్లడం, ఆలయంలో ప్రార్థనలు చేయడం వంటివి తప్ప ప్రజల ఇబ్బందుల మీడియా చూపించడం లేదని ఫైర్ అయ్యారు. #WATCH | Chhattisgarh: At a public meeting in Bastar, Congress leader Rahul Gandhi says, "You'll be surprised to know that 22 people in the country have the exact wealth as the 70 crore people in the country have. PM Modi helps those 22 people all day long. Unemployment is… pic.twitter.com/1QZnbmcKID — ANI (@ANI) April 13, 2024 మహళలకు నెలకు రూ.8,500... దేశ ప్రజల జీవితాలు మార్చడమే తమ లక్ష్యమని అన్నారు రాహుల్ గాంధీ. ప్రధాని నరేంద్ర మోడీ లక్షాధికారులకు డబ్బు ఇవ్వగలిగితే, కాంగ్రెస్ ఆ డబ్బును పేదలకు ఇవ్వగలదు అని పేర్కొన్నారు. దేశంలోని మహిళలను ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టిందని అన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి అర్హులైన మహిళా ఖాతాల్లో నెలకు రూ.8,500 జమ చేస్తామని అన్నారు. మొత్తం ఏడాదికి మహిళలకు ఈ పథకం కింద రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తామన్నారు. కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి రాగానే పేదరికాన్ని లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. #WATCH | Chhattisgarh: At a public meeting in Bastar, Congress leader Rahul Gandhi says, "We want to change your lives, we want to help you. If Narendra Modi can give money to millionaires, Congress can give that money to the poor. And so we are bringing a new policy,… pic.twitter.com/HAqsyr8B4P — ANI (@ANI) April 13, 2024 #rahul-gandhi #modi #mahalakshmi-scheme #2024-lok-sabha-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి