BJP MP Raghunandan Rao: అధికారం కోసమే మోసపూరిత హామీలు ఇచ్చారు: ఎంపీ రఘునందన్‌రావు

TG: డిసెంబర్‌ 9లోపు రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడని అన్నారు రఘునందన్ రావు. అందరికి ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని.. అధికారం కోసమే మోసపూరిత హామీలు ఇచ్చారని అన్నారు.

New Update
BJP MP Raghunandan Rao: అధికారం కోసమే మోసపూరిత హామీలు ఇచ్చారు: ఎంపీ రఘునందన్‌రావు

BJP MP Raghunandan Rao: రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని అన్నారు బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు. డిసెంబర్‌ 9లోపు రుణమాఫీ చేస్తానని సీఎం అన్నారు.. పోయిందని చురకలు అంటించారు. ఇప్పుడు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామంటున్నారని అన్నారు. ఇప్పుడేమో కమిటీ వేసి ఎవరికి ఇవ్వాలో.. ఇవ్వకూడదో పరిశీలిస్తారంటా అని ఫైర్ అయ్యారు.

భూమి ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి చాలా మాట్లాడారని.. కాంగ్రెస్ పార్టీ వ్యక్తి వేధింపులతోనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ ఇస్తామన్నారు.. ఇవ్వట్లేదని ఆరోపించారు. అధికారం కోసమే మోసపూరిత హామీలు ఇచ్చారని అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HMD Barbie Phone: రూ.7,999లకే డబుల్ డిస్‌ప్లే ఫోన్.. సేల్ ప్రారంభం!

HMD బార్బీ ఫోన్‌ ఇటీవల భారతదేశంలో లాంచ్ అయింది. ఇవాళ అంటే ఏప్రిల్ 21 నుండి ఈ ఫోన్ సేల్‌కు అందుబాటులోకి వచ్చింది. కంపెనీ దీని ధరను రూ.7,999గా నిర్ణయించింది. HMD ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.

New Update
HMD Barbie Phone

HMD Barbie Phone Photograph: (HMD Barbie Phone)

స్మార్ట్‌ఫోన్ కంపెనీ HMD గత నెలలో భారతదేశంలో HMD బార్బీ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇవాళ అంటే ఏప్రిల్ 21 నుండి ఈ ఫోన్ సేల్‌కు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్లిప్ ఫోన్‌లో 2.8-అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే.. 1.77-అంగుళాల కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఒకే పింక్ కలర్‌లో వస్తుంది. ఈ బార్బీ ఫోన్‌లో 1,450mAh బ్యాటరీ ఉంది. ఇప్పుడు దీని ధర, ఫీచర్లు తెలుసుకుందాం. 

HMD Barbie Phone Price

HMD బార్బీ ఫోన్ రూ.7,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి HMD ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. ఇది పవర్ పింక్ కలర్‌లో మాత్రమే వస్తుంది. HMD బార్బీ ఫోన్ రిటైల్ బాక్స్‌ను బంగారం పెట్టెగా కూడా ఉపయోగించవచ్చు. HMD ఈ ఫోన్‌తో పాటు బార్బీ థీమ్‌తో వెనుక కవర్, స్టిక్కర్లు, పూసల లాన్యార్డ్ పట్టీని అందించింది.

HMD Barbie Phone Specifications

HMD బార్బీ ఫోన్‌లో 2.8-అంగుళాల QVGA ఇన్నర్ డిస్‌ప్లే, 1.77-అంగుళాల QQVGA కవర్ డిస్‌ప్లే ఉన్నాయి. ఫోన్ బయటి డిస్ప్లే కూడా అద్దంలా పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో యూనిసోక్ T107 ప్రాసెసర్ అందించారు. ఇది 64MB RAM + 128MB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 32GB వరకు విస్తరించవచ్చు. HMD బార్బీ ఫోన్ S30+ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. ఇది బార్బీ థీమ్ వాల్‌పేపర్‌లు, సంబంధిత యాప్ ఐకాన్‌లతో వస్తుంది.

దీని వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో 0.3 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 1,450mAh రిమూవబుల్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 108.4 మిమీ పొడవు, 18.9 మిమీ మందం, 55.1 మిమీ వెడల్పు, 123.5 గ్రాములు బరువు ఉంటుంది. బార్బీ ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ 5.0, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇది వైర్డు, వైర్‌లెస్ మోడ్‌లతో FM రేడియో, MP3 ప్లేయర్‌తో వస్తుంది.

tech-news | telugu tech news | HMD Barbie Flip Phone | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment