Carrot Face Pack: క్యారెట్‌ ఫేస్‌ ప్యాక్‌తో కాంతివంతమైన చర్మం

ప్రతీరోజు మనం ఆహారంలో క్యారెట్ తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది. క్యారెట్‌లో విటమిన్ ఏ, సి, కె, లాంటి పోషకాలు ఎక్కువ. క్యారెట్ వల్ల ఆరోగ్యంతోపాటు ముఖం అందంగా తయారవుతుంది. క్యారెట్‌తో ఫేస్ ప్యాక్‌ వేసుకుంటే ముఖం ఎంతో కాంతివంతంగా ఉంటుంది.

New Update
Carrot Face Pack: క్యారెట్‌ ఫేస్‌ ప్యాక్‌తో కాంతివంతమైన చర్మం

Carrot Face Pack Beauty Tips:  ప్రతిరోజు మనం ఆహారంగా అనేక రకాల కూరగాయలు తింటూ ఉంటాం. అందులో ఒకటి క్యారెట్.. క్యారెట్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వైద్యులు కూడా నిత్యం క్యారెట్ తినాలని చెబుతూ ఉంటారు. క్యారెట్ జ్యూసులు మన రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అంతేకాకుండా అందులో ఉండే విటమిన్ ఏ, సి, కె, బీట్ కెరోటిన్స్ వంటి పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కంటి చూపు కూడా క్యారెట్‌ (Carrot ) తినడం వల్ల ఎంతో మెరుగవుతుంది. క్యారెట్ తినడం వల్ల మన చర్మం ఆరోగ్యంగా, ఎంతో అందంగా తయారవుతుంది. కేవలం క్యారెట్‌ను తినడమే కాకుండా ఫేస్ ప్యాక్‌గా కూడా చేసుకొని వాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి: ఈ ప్యాక్‌తో అవాంఛిత రోమాలు మాయం

దీనివల్ల మన ముఖం (Face )అందం రెట్టింపు అవుతుంది. క్యారెట్‌తో ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలో, దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఓ గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల క్యారెట్ రసం వేసుకోవాలి, కొద్దిగా అరటిపండు (banana) గుజ్జు, నాలుగు చుక్కల నిమ్మరసం, కోడిగుడ్డు సోన (Egg golden) అందులో కలుపుకోవాలి, ఆ పేస్ట్‌ను మన ముఖానికి రాసుకొని అది ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే ముడతలు తొలగిపోయి కాంతివంతంగా తయారవుతుంది. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలాగే ఒక గిన్నెలో రెండు చెంచాల క్యారెట్‌ రసం తీసుకోవాలి, ఇందులో రెండు చెంచాల బొప్పాయి రసం వేసి బాగా కలుపుకుని ముఖానికి రాసుకోవాలి, అది ఆరిపోయిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడగడం వల్ల చర్మ సమస్య (Skin problems)లు తగ్గిపోతాయి. అంతేకాకుండా మన ముఖం (Face )ఎంతో కాంతివంతంగా తయారవుతుంది.

ఇది కూడా చదవండి: అన్నం బదులు ఇవి తింటే వందేళ్లు ఆరోగ్యం

Advertisment
Advertisment
తాజా కథనాలు