/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-10-7-jpg.webp)
Raashii : స్టార్ నటి రాశీ ఖన్నా(Raashii Khanna) నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలబ్రిటీల పర్సనల్ అండ్ కెరీర్ లైఫ్(Celebrities Personal & Career Life) గురించి నెగిటీవ్ కామెంట్స్(Negative Comments) చేయడంపై మండిపడింది. అంతేకాదు సినిమాల్లో హీరోహీరోయిన్ల మధ్య ఉండే రొమాంటిక్ సీన్స్(Romantic Scenes) పై వల్గర్ కామెంట్స్ చేయడంపై అసహనం వ్యక్తం చేసింది.
Happy Weekend ✨#RaashiKhanna pic.twitter.com/Lgy0CxOTSi
— Raashi Khanna (@RaashiKhanna) March 9, 2024
Also Read : సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు బాలాజీ హఠాన్మరణం
అవన్నీ నిజం కావు..
ఈ మేరకు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ‘సినిమాల్లో చూపించేవన్నీ నిజాలు కావు. పాత్రలు పండించేందుకు నటుడితో క్లోజ్‌గా ఉంటాం. అది వృత్తి ధర్మం. అదే నిజం అనుకుంటే ఎలా?
నేను ఇంట్రావర్ట్. సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఇంట్రావర్ట్. ఇద్దరివీ త్వరగా కలిసే మనస్తత్వాలు కావు. ఇద్దరం ఢిల్లీకి చెందిన వారమే. దాంతో మా ప్రాంతం గురించి మాట్లాడుకునేవాళ్లం. అది కూడా అరుదుగానే. పైగా మేమిద్దరం పరిచయస్తులం కూడా కాదు. ఇక కెమెరా ముందుకొస్తే పాత్రోచితంగా నటించడం మా బాధ్యత. ‘యోధ’లో కథ అవసరం మేర నటించాం. తెరపై మా ఇద్దరి కెమిస్ట్రీ బావుందంటే, బయట కూడా అలాగే ఉంటాం అని కాదు. మా హద్దులు మాకు తెలుసు. మీ హద్దుల్లో మీరుంటే మంచిది’ అంటూ ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రేమలో ఉన్నారంటూ వార్తలు..
ఇక ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఆమె నటించిన ‘యోధ’ చిత్రం ఇటీవలే విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సిద్ధార్థ్‌మల్హోత్రతో రాశీఖన్నా స్క్రీన్ కెమిస్ట్రీపై బాలీవుడ్ మీడియాలో తీవ్రమైన చర్చ నడుస్తుంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు షికార్లు చేయడంతో రాశీఖన్నా రియాక్ట్ అయింది.